మారుతీరావు ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందో తెలుసా..?

అమృత తండ్రి, ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే.మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేమిటి అనే ప్రశ్నకు ఎవరి దగ్గరా సరైన సమాధానం లేదు.

 What Happened Before Maruthi Rao Commited Suicide-TeluguStop.com

మారుతీరావు బలవన్మరణం విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మారుతీరావు ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందనే ప్రశ్నకు ఆసక్తికరమైన విషయాలు సమాధానాంగా వినిపిస్తున్నాయి.

శనివారం సాయంత్రం మారుతీరావు న్యాయవాదిని కలిసి, మాట్లాడేందుకు హైదరాబాద్ కు వచ్చారు.సాయంత్రం 6 గంటల 35 నిమిషాల సమయంలో తాను ఎప్పుడూ దిగే ఆర్యవైశ్యభవన్ లో గది అద్దెకు తీసుకున్నారు.7.30 గంటల సమయంలో డ్రైవర్ ను పిలిచి గారెలు తెచ్చిపెట్టమని చెప్పారు.అనంతరం డ్రైవర్ కు 500 రూపాయలు ఇచ్చి హోటల్ లో భోజనం చేసి కారులోనే పడుకోవాలని సూచనలు చేశారు.

ఆ తరువాత కొంత సమయం పాటు భార్యతో ఫోన్ మాట్లాడిన మారుతీరావు వైట్ పేపర్లను తెప్పించుకున్నారు.ఉదయం 6 గంటలకు డ్రైవర్ తలుపు కొట్టగా మారుతీరావు తలుపు తీయకపోవడంతో అక్కడినుండి వెళ్లిపోయాడు.7 గంటలకు మరలా తలుపు కొట్టగా ఎటువంటి స్పందన లేకపోవడంతో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా అచేతనంగా చనిపోయిన స్థితిలో మారుతీరావు కనిపించాడు.ప్రణయ్ హత్య కేసులో శిక్ష పడుతుందని భావించి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube