అరచేతిలో పుట్టుమచ్చలు ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?

జ్యోతిషశాస్త్రం ప్రకారం మన శరీరంలో ప్రతి అవయవం ఒక సంకేతాన్ని తెలియజేస్తుంది.మన అరచేతిని చూసి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మన భవిష్యత్తు, వర్తమానం, గతంలో జరిగిన సంఘటనలను జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తుంటారు.

 What Happen If Mole Was In The Hand  Mole In Hand, Lucky Symptom, Astrology, Hin-TeluguStop.com

మనం పుట్టుకతోనే మన శరీరంపై మచ్చలు ఏర్పడుతుంటాయి.కొందరిలో పెరుగుతుండడం కొద్దీ మచ్చలు పుడతాయి.

అయితే కొన్ని చోట్ల ఈ మచ్చలు ఉండటం వల్ల వారి జాతకం ఎంతో అదృష్టం గా ఉంటుందని భావిస్తుంటారు.అయితే అరచేతిలో మచ్చలు ఉండడం వల్ల మన జాతకం ఎలా ఉంటుందో, మన జీవితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా మన అరచేతులను చూసి జ్యోతిషశాస్త్ర నిపుణులు మన జీవితాన్ని అంచనా వేస్తుంటారు.

అలాగే అరచేతిలో మచ్చలు ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.సాధారణంగా మగవారికి కుడి చేతిని, ఆడవారికి ఎడమ చేతిని చూసి జ్యోతిష్యం చెబుతుంటారు.

మగవారికైనా, ఆడవారికైనా అరచేతి బొటనవేలు కిందిభాగంలో పుట్టుమచ్చ ఉంటే వారి జీవితంలో ప్రేమానురాగాలతో ఉండడంతోపాటు, నీతి నిజాయితీగా ప్రవర్తిస్తారు.

ఎవరికైతే పుట్టుమచ్చ చూపుడు వేలు క్రింది భాగంలో ఉంటుందో వారు ఆరోగ్యంపట్ల ఎంతో జాగ్రత్తలను తీసుకోవాలి.

లేదంటే వారిజీవితంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు.ఎవరికైతే మణికట్టుపై భాగంలో పుట్టుమచ్చ ఉంటుందో వారిజీవితంలో అన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.

వారు లక్ష్య సాధనకై వారి వైవాహిక జీవితం అడ్డు పడుతుంది.

అర చేతి చిటికెన వేలు కింది భాగంలో, ఉంగరపు వేలు క్రింది భాగంలో పుట్టుమచ్చలు ఉన్న వారు వారి జీవితంలో తీవ్ర నష్టాలను చవి చూస్తారు.

అలాకాకుండా అరచేతి మధ్యభాగంలో పుట్టుమచ్చ ఉంటే ఇది రెండు రకాల ఫలితాలను ఇస్తుంది.కొన్ని సార్లు మనం ఎటువంటి కష్టం పడకపోయినా దానికి ప్రతిఫలం దక్కుతుంది.కొన్నిసార్లు ఎంతో కష్టపడి పని చేసినా తీవ్ర నిరాశే ఎదురవుతుందని, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube