చెప్పులు పోతే మంచిదే కాని కండీషన్స్‌ అప్లై.. చెప్పులు దానం తీసుకోవద్దు ఎందుకో తెలుసా..?

ఏదైనా రద్దీగా ఉన్న దేవాలయంకు వెళ్లిన సమయంలో చెప్పులు బయట కుప్పలు తెప్పలుగా ఉంటాయి.కొన్ని దేవాలయాల వద్ద పాద రక్షలు పెట్టేందుకు వీలు ఉంటుంది, కాని కొన్ని దేవాలయాల్లో మాత్రం బయటే వదిలేస్తారు.

 What Happen If Footwear Is Stolen Or Lost-TeluguStop.com

అలా వదిలేసిన సమయంలో కొందరు చిలిపిగా ఆలోచిస్తారు.తమ పాత చెప్పులను వదిలేసి కొత్తగా కనిపించే చెప్పులను వేసుకోవాలనుకుంటారు.

కొత్త చెప్పులు వేసుకుని మెల్లగా జారుకుంటారు.అయితే కొత్త చెప్పులు పోయినప్పుడు బాధ అనిపించినా, చెప్పులు పోతే శని పోయినట్లుగా భావించి పర్వాలేదులే అనుకుంటారు.

కాని చెప్పులు పోవడం వల్ల మంచిదా అనేది కొందరి అనుమానం.

ఈ విషయం గురించి పెద్దలు ఏమంటున్నారంటే చెప్పులు పోవడం మంచిదే కాని, అవి లెదర్‌ చెప్పులు అయితేనే మంచిదట.

షూస్‌, సాండిల్స్‌ వంటివి పోతే శని పోయినట్లు కాదట.పాదాల వద్ద చర్మంకు ఆనుకుని శని ఉంటుందట.పాదాలకు లెదర్‌ అంటే చర్మంతో తయారు చేసిన చెప్పులను వేసుకున్న సమయంలో శని చెప్పుల్లో ఉంటుంది.అంటే చెప్పులు పోయిన సమయంలో ఆ శని కూడా పోయినట్లు అవుతుందని పెద్దలు చెబుతున్నారు.

అందుకే లెదర్‌ చెప్పులు పోతే తప్ప మరే ఇతర చెప్పులు పోయినా కూడా శని పోయినట్లుగా భావించవద్దు.

ఇక కొందరు చెప్పులు దానం చేస్తే శని పోతుందని చెప్పులు దానం చేస్తూ ఉంటారు.అయితే లెదర్‌ చెప్పులు దానం చేస్తేనే శని పోతుందని ఈ విషయంతో పాటే అర్థం అవుతుంది.చెప్పులను దానం తీసుకోవడం ఏమాత్రం సబబు కాదు, ఎవరైనా బయటి వారు దానం ఇచ్చినా కూడా వాటిని తీసుకోవద్దు.

ఇంట్లో వాళ్లు ఇస్తే తప్ప బయటి వారి దానం చెప్పులు అస్సలు తీసుకోవద్దు.ఎందుకంటే వారి శని మీకు వస్తుంది.అందుకే మీ చెప్పులు మీరు చూసుకోండి.చెప్పులు ఫ్రీగా వస్తున్నాయి కదా అని తీసుకోకండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube