WWE వీరులు రోజు ఏం తింటారో, ఎలా తింటారో తెలుసా ?  

What Famous Wwe Superstars Eat In Daily Diet ? -

WWE చూసే అలవాటు ఉందా ? ఇప్పుడు చూడట్లేదు ఏమో కాని, ఒకప్పుడు అయితే చూసేవారు కదా.జాన్ సీనా, రాక్ .

ఇలాంటి సూపర్ స్టార్స్ కి మీరు ఎదో ఒక దశలో ఫ్యాన్ అయి ఉంటారు.వాళ్ళు అలా కుర్చిలతో, బల్లలతో రక్తాలు కారేలా కొట్టుకోవడం నిజమా కాదా అనే విషయాన్ని కాసేపు పక్క పెడదాం.

What Famous WWE Superstars Eat In Daily Diet -Telugu Health-Telugu Tollywood Photo Image

వాళ్ళంతా ఎంత ఫిట్ గా ఉంటారో కదా.కండలు తిరిగిన దేహం, భారి కాయం .అయినా సరే, రింగ్ లో చురకుగా కదులుతారు, గాల్లోకి చక్కర్లు కొడుతూ మరి కిక్ కొడుతుంటారు, అలవోకగా రింగ్ పై నుంచి దూకుతుంటారు.గంటలకొద్దీ దెబ్బలాడుకుంటారు.

ఇవి కేవలం బలం, బరువుకి సంబంధించిన విషయాలు కావు.ఫిట్ నెస్ కి సంబంధించిన విషయాలు.

ఫిట్ గా ఉంటార్ కాబాట్టే, 100 కేజిల నుంచి 250 కేజీల బరువ ఉండే యోధులు రింగ్ లో అంత చురుకుగా ఉంటారు.వాళ్ళు ఎలాగో గంటల తరబడి వ్యాయామం చేస్తారు.కాని తిండి ఏం తింటారు ? అంత బలం, ఫిట్ నెస్ ఊరికే రాదుగా ? కొందరు ఫేమస్ WWE రెజ్లర్స్ తమ డైట్ లో ఏం తీసుకుంటారో ఇప్పుడు చూద్దాం.

* Brock Lesnar :

ఇతడిని రెజ్లింగ్ ప్రపంచంలో జంతువు అని అంటారు.అతనికున్న బలం అలాంటిది మరి.బిరుదుకి తగ్గట్లే ఒకప్పుడు సొంతంగా జంతువులని వేటాడి తినేవాడట.కాని ఒక విచిత్రమైన జబ్బు వచ్చాక శాకాహారం ఎక్కువ తినమని చెప్పారట డాక్టర్లు.అప్పటినుంచి ఆకుకూరలు ఎక్కువ తింటున్నాడు.అలాగని మాసం పూర్తిగా మానేయ్యలేదు.

* Big Show :

రెండు వందల కేజీలకు పైగా బరవు, 7 ఫీట్లకు పైగా ఎత్తు ఉండే బిగ్ షో, తన భారి కాయానికి తగ్గట్టే రోజుకి అయిదు సార్లు తింటాడు.మనం ఒక గుడ్డుతో ఒక ఆమ్లెట్ వేసుకుంటే, ఇతడు 20 గుడ్లతో ఒక ఆమ్లెట్ వేసుకుంటాడటా.గుడ్లు, పాలు బాగా తీసుకునే బిగ్ షో, మాంసాహారం విపరీతంగా తింటాడటా.

మరి తన ఆకారానికి ఆకలి తీరాలి కదా.ఐస్ క్రీమ్స్ టైంపాస్ కి తింటాడటా.

* Ryback:

రెజ్లింగ్ ప్రపంచంలో బలానికి మారు పేరు ఇతగాడు.ఆ కండలు సిమెంట్ గోడల్లా ఉంటాయి.

టిఫిన్ కిందా పెద్ద ప్లేటులో పాస్తా తింటాడటా.ప్రతి రెండు మూడు గంటలకి ఓసారి భోజనం చేస్తాడు.

ఇతగాడి భోజనంలో బ్రౌన్ రైస్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, తునా ఫిష్ ఉంటుంది, మరియు గుడ్లు ఉంటాయి.ఇక ప్రోటీన్ షేక్స్ కూడా బాగా తాగుతాడు.

* The Rock :

WWE చరిత్రలోని అతిపెద్ద సూపర్ స్టార్స్ లో ఒకడు.రెజ్లింగ్ వదిలేసి హాలివుడ్ కి వెళితే, అక్కడ కూడా ఇతగాడి కండలకి భారి డిమాండ్ ఏర్పడింది.

పొద్దున్నే, 4-5 గంటల ప్రాంతంలో లేస్తాడటా.ప్రోటీన్స్ తో పాటు ఫైబర్ ఉండే ఆలారాల్ని ఎక్కువ తింటాడు.

చికెన్ విపరీతంగా తింటాడు.ఎంత తింటాడు అంటే రోజుకి ఓ రెండు కేజీలు అయినా.ఎటు చేసి రోజుకి 5000 కాలరీలు తన కడుపులో పడేలా చూసుకుంటాడు.

* John Cena :

2005 నుంచి మొదలు, ఇప్పటికి రెజ్లింగ్ ప్రపంచాన్ని ఏలుతున్నాడు.మోడరన్ రెజ్లింగ్ లో ది రాక్ తో పాటు జాన్ సీనా అతిపెద్ద సూపర్ స్టార్స్ లో ఒకడు.ఇతడ్ని ఫేస్ ఆఫ్ WWE అని అంటారు.

రోజుకి నాలుగు చికెన్ బాడిలు తింటాడు.పూర్తిగా మాంసాహారి కాదు.

కూరగాయలు కూడా బాగా తింటాడు.వ్యాయామాలు చేయడం అంటే పిచ్చి.అందుకే ఆ ఫిట్ నెస్ లెవల్స్ సొంతం చేసుకొని, తన కన్నా ఎక్కువ ఎత్తు, బరువు ఉన్నవారిని కూడా చిత్తు గా ఓడిస్తూ, దశాబ్దకాలంగా నెం.1 గా ఉంటూ వస్తున్నాడు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

What Famous Wwe Superstars Eat In Daily Diet ?- Related....