మీ సంతకం స్టైల్ ను బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి..మొత్తం తొమ్మిది రకాలు...అందులో మీ సంతకం ఏ రకం??  

What Does Your Signature Say About You-

మీ సంతకాన్ని చూసి మీ వ్యక్తిత్త్వాన్ని అంచనా వేసి చెప్పొచ్చట… అదే గ్రాఫాలజీ.ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కదా అదెలాగో ఇది అలాగే… మీరు సంతకం చేసే స్టైల్ ను బట్టి మీ సైకాలజీ ఎలా ఉంటుంది, మీ పని తీరు ఎలా, మీ ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా కరెక్ట్ గా చెప్పొచ్చట.

దీని గురించి ఇప్పటికే చాలా మందికి కొద్దో గొప్పో అవగాహన కూడా ఉండి ఉంటుంది.అయితే మనం సాధారణంగా కొన్ని రకాల సంతకాలు పెడుతుంటాం… ఇప్పుడు వాటి ఆధారంగా మన వ్యక్తిత్త్వం ఎలా ఉంటుందో ఓ సారి పరిశీలిద్దాం.

What Does Your Signature Say About You- Telugu Viral News What Does Your Signature Say About You--What Does Your Signature Say About You-

సంతకం పెట్టి కింద గీత గీసే వాళ్ళు:

సాధారణంగా వీరికి కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది.అయినప్పటికీ వీరు కొన్నింటిని గుడ్డిగా నమ్ముతుంటారు.

వాళ్ళకు తెలిసిందే వేదం అనే టైపు.మనుషులను త్వరగా నమ్మరు, నమ్మితే మాత్రం వారి కోసం ప్రాణం ఇచ్చే టైపు.

సిగ్నేచర్ హ్యాండ్ రైటింగ్ కంటే పెద్ద సైజ్ లో ఉంటే:

సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.వీరికి కాన్సిడెన్స్ శాతం ఎక్కువ, దేనికైనా ముందుంటారు.అంతేకాదు వీరు చాలా ధైర్యవంతులు.

సంతకం పెడుతున్నప్పుడు అక్షరాలు కింది వైపుకు వస్తుంటే: ఇలాసంతకం చేసే అలవాటు కొందరికి ఉంటుంది.వీళ్లకు ఎలాంటి లక్షణం ఉంటుందంటే వీళ్లకి స్వార్థం పాళ్లు ఎక్కువ.

సంతకం పెట్టేటప్పుడు అక్షరాలు పై వైపుకు వెళుతుంటే: వీరు చాలా షార్ఫ్ , పాజిటివ్ ఆటిట్యూడ్ ఉన్నవారు.

ఏదైనా విషయాన్ని త్వరగా ఆకలింపు చేసుకుంటారు, అభివృధ్ది పదం వైపు తర్వగా పయనిస్తారు.

సంతకంలో మొదటి అక్షరం సైజ్ పెద్దగా ఉంటే: నాయకత్వ లక్షణాలెక్కువ.

మొదటి అక్షరాన్ని రౌండ్ చేస్తూ సంతకం చేస్తే: కొందరికి సంతకం పెట్టే ముందు మొదటి అక్షరాన్ని రౌండ్ చేస్తూ పెడతారు.అలాంటివారికి సక్సెస్ కంటిన్యూ గా ఉండదట.

సంతకం చేసి చివరి అక్షరం నుండి గీతను వెనుకకు లాగడం: గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు.ప్రస్తుతం మీద ఎక్కువగా దృష్టి పెట్టరు.

సిగ్నేచర్ లో డాట్స్ ఉపయోగించడం: నేను చాలా బిజీ అనుకునే రకం.నా కేంటీ.? అనే టైపు.

సిగ్నేచర్ లో గ్యాప్ ఎక్కువగా ఉంటే: ఆరంభ శూరత్వం ఎక్కువ… మంచి మంచి ఐడియాలు చాలనే ఉంటాయ్ కానీ వాటిని కార్యచరణలో పెట్టడంలో మాత్రం విఫలమవుతుంటారు.

తాజా వార్తలు