కన్ను అదిరితే శకునమా?? దాని వెనుక ఉన్న రామాయణ కథ..  

What Does Right Eye Twitching Is Good Are Bad-

ఆడవారికి ఎడమకన్ను అదిరితే మంచిదని.మగవారికి కుడి కన్ను అదిరితే చెడు అని అనడం మనం వింటుంటాం…మనకి వాస్తు శాస్త్రంలానే శకున శాస్త్రం కూడా వున్నది..

What Does Right Eye Twitching Is Good Are Bad--What Does Right Eye Twitching Is Good Are Bad-

దాని ప్రకారం మన కన్ను అదిరితే మంచి,చెడు అని చెప్తుంటారు.పురుషులకు ఎడమకన్ను … స్త్రీలకు కుడికన్ను అదరడం మంచిదికాదనే విశ్వాసం పురాణకాలం నుంచి ఉందని రామాయణానికి సంభందించిన ఒక కథ చెప్తుంది.అదేంటంటే.

రావణుడు అపహరించడానికి ముందు సీతమ్మవారికి కూడా కుడికన్ను అదిరినట్టు కొన్ని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.వనవాస కాలంలో సీతారామలక్ష్మణులు అరణ్యప్రాంతంలో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వుంటారు.ఆహ్లాదాన్ని కలిగించే ఒక ప్రదేశంలో కొంతకాలం వుండదలచి పర్ణశాలను ఏర్పాటు చేసుకుంటారు.

అక్కడవారికి ఆనందంగా రోజులు గడిచిపోతుంటాయి.అలాంటి పరిస్థితుల్లోనే రావణుడి సోదరి అయిన ‘శూర్పణఖ’ ముక్కుచెవులను లక్ష్మణుడు కోస్తాడు.ఆ సంఘటన అక్కడితో ముగిసిందని వాళ్లు అనుకుంటారు.

కానీ తన సోదరికి జరిగిన అవమానానికి రావణుడు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.అందుకు గాను శ్రీరాముడి భార్య అయిన సీతను అపహరించాలని అనుకుంటాడు.

ఆ సమయంలోనే ఇక్కడ సీతమ్మకి కుడికన్ను అదిరిందట.దాంతో ఏదో కీడు జరగనుందని సీతమ్మ ఆందోళనని వ్యక్తం చేసినట్టుగా చెప్పబడుతోంది.ఇలా కుడికన్ను అదిరితే ఏదో కీడు జరుగుతుందనే విశ్వాసం ఆ కాలం నుంచి ఉన్నట్టుగా కనిపిస్తుంది..

ప్రతిసారి శరీర భాగాలదిరినప్పుడు మనకి అనుకూలమైన సూచన అయితే ఏదో మంచి జరుగుతుందని కానప్పుడు ఏదో కీడు జరుగుతుందని అనుకోవడానికి లేదు.కేవలం కొన్ని సార్లు మాత్రమే అదిరితే అది శకునం కావచ్చు.

వాస్తవానికి మన శరీర భాగాలు అదరడానికి కారణాలుకొందరు ఉదయం నుండీ రాత్రిదాకా అదిరిందంటారు, కొందరికి శరీర భాగాలు తరచూ అదరవచ్చు…అది నరాల బలహీనతకు సూచన.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వాత, పిత్త గుణాలు ప్రకోపించినప్పుడు శరీరంలో భాగాలు అదురుతాయంటారు.

కళ్ళ వ్యాధులున్నాకూడా కంటి భాగాలు తరచూ అదరవచ్చు.అలాంటప్పుడు డాక్టరుని సంప్రదించాలిగానీ నమ్మకాలని పట్టుకుని వేళ్ళాడకూడదు.