బాబు ఓడితే , జగన్ గెలిస్తే...కేసీఆర్ కి లాభమేంటి..???  

What Does Kcr Gain If Jagan Wins And Babu Lose-chandrababu,elections,kcr,political Updates,tdp,telangana,trs,ycp,ys Jagan

 • ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయంలో ఆయా పార్టీల అధినేతల కంటే కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఎంతో ఆసక్తి నెలకొంది. ఏపీలో అధికారాన్ని చేపట్టేది బాబా, లేక జగనా అనే ప్రశ్నకు కెసిఆర్ మాత్రం చటుక్కున జగన్ అనే సమాధానం ఇస్తున్నారు.

 • బాబు ఓడితే , జగన్ గెలిస్తే...కేసీఆర్ కి లాభమేంటి..???-What Does KCR Gain If Jagan Wins And Babu Lose

 • జగన్ బ్రహ్మాండంగా గెలవబోతున్నారో అంటూ ప్రకటనలు కూడా చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా జగన్ గురించి కెసిఆర్ ఇలాంటి ప్రకటనలు చేయడం అందరికీ తెలిసిందే అయితే

  జగన్ అధికారంలోకి రావాలి చంద్రబాబు అధికారంలోకి రాకూడదు అనే నిర్ణయానికి కేసీఆర్ ఎందుకు వచ్చారు వైసిపికి కేసీఆర్ ఎందుకు సహకరిస్తున్నారు.

 • అనే విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే వైసీపీ చేసిన ఫిర్యాదు తో టీడీపీ యాప్ నిర్వహిస్తున్న ఓ సంస్థ పై కూడా తెలంగాణ సర్కార్ దాడి చేసి జగన్ కి మేలు చేసిన విషయం తెలిసిందే, ఇలా ఎన్నో సందర్భాలలో జగన్ కి అనుకూలంగా కేసీఆర్ తెలంగాణలో సాయం చేశారు.

 • What Does KCR Gain If Jagan Wins And Babu Lose-Chandrababu Elections Kcr Political Updates Tdp Telangana Trs Ycp Ys

  ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా కేసీఆర్ జగన్ లపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వైసిపికి ఎన్నికల్లో డబ్బు సహాయంగా 1000 కోట్లు కేసీఆర్ ఇచ్చారని చంద్రబాబు పదేపదే ఆరోపిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిపోయిన ప్రచార సామగ్రిని కూడా కేసీఆర్ వైసీపీకి పంపినట్టుగా కొన్ని సంఘటనలతో రుజువయ్యింది. ఇక డబ్బుల పంపిణీ కూడా కొన్ని చోట్ల తెలంగాణకు చెందిన వారు చేస్తున్నారని ని పట్టుబడిన కొంతమంది ఆధారాల ద్వారా వెల్లడవుతోంది.

 • అయితే నిన్న మొన్నటి వరకు జగన్ విషయంలో బయటపడని కేసీఆర్ ఎన్నికలు రెండు రోజుల్లో ఉన్నాయనగా జగన్ తాను ఒకటేనని వెల్లడించారు. నిజానికి కేసీఆర్ ఇలా ప్రకటించడానికి జాతీయ రాజకీయాలు కూడా ఒక కారణమని అంటున్నారు విశ్లేషకులు.

 • ఎందుకంటే కేసీఆర్ ప్రతీ ప్రచార సభలో తెలంగాణ ప్రజలు 16 సీట్లు ఇస్తే తాను 120 సీట్లు ఇస్తానని అంటున్నారు. అంటే 120 సీట్లు తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ ,బీఎస్పీ ,జెడిఎస్ లాంటి పార్టీలకు వచ్చే సీట్లని అర్థం. `అయితే ఆ పార్టీల అధినేతలు అందరూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారానికి వచ్చిన విషయం విధితమే.

  వారందరూ చంద్రబాబు ప్రధాని అవుతారని కృష్ణాజిల్లాలో చెబుతున్నారు.

 • దీంతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్లో ఎవరు లేరని స్పష్టమవుతోంది. ఇలాంటి సమయంలో తన ఫ్రంట్ కి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని చెప్పుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఏపీలో జగన్ కు వచ్చే సీట్లు ఎన్ని ఉంటే అన్ని టీఆర్ఎస్ కి మద్దతుగా ఉంటాయని కేసీఆర్ నిర్ణయానికి నిర్ణయానికి వచ్చారట.

 • ఒక వేళ బాబు ఓడిపోతే బాబు కి మద్దతు ఇస్తున్న వారందరూ జగన్ తో కలిసి కేసీఆర్ కి మద్దతు ఇస్తారని కేసీఆర్ నమ్మకం. ఇదీ కేసీఆర్ లెక్క అంటున్నారు విశ్లేషకులు.