ఈ 11 జంతువుల్లో కలలో ఏ జంతువు కనిపిస్తే ఏమవుతుందో తెలుసా.? ఏది కనిపిస్తే చెడు అంటే.?

నిద్ర‌పోతున్న‌ప్పుడు మ‌న‌కు క‌ల‌లు రావ‌డం అనేది చాలా స‌హ‌జ‌మైన విష‌యం.ఒక్కొక్క‌రికి ఒక్కో ర‌క‌మైన క‌ల వ‌స్తూ ఉంటుంది.

 What Do 11 Animals Symbolize In Dreams-TeluguStop.com

కొంద‌రికి భ‌య పెట్టే క‌ల‌లు వ‌స్తే కొంద‌రికి న‌వ్వు తెప్పించే క‌ల‌లు వ‌స్తాయి.కొంద‌రికి త‌మ నిత్య జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌నల తాలూకు క‌ల‌లు వ‌స్తాయి.

అయితే చాలా మందికి మాత్రం క‌ల‌లో ఏదో ఒక జంతువు క‌నిపిస్తూ ఉంటుంది.ఈ క్ర‌మంలోనే దీనికి కార‌ణం ఏమిటో, ఏ జంతువు క‌ల‌లో క‌నిపిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1.కుందేలు


క‌ల‌లో కుందేలు క‌నిపిస్తే మీకు భ‌విష్య‌త్ అనుకూలంగా ఉంటుంద‌ని అర్థం.కుందేలు అదృష్టానికి గుర్తు.మీ భవిష్యత్తు ప్రయత్నాలు మీకు అనుకూలంగా మారుతాయి.తెల్ల కుందేలు నిజమైన ప్రేమకు సూచన.పచ్చిక బయళ్ళలో దూకుతూ, ఆడుకుంటున్న తెల్ల‌ కుందేళ్ళు క‌నిపిస్తే త్వ‌రలో ఏదో సంతోష‌మైన వార్త వింటార‌ని అర్థం.

2.లేడి


లేడి దయ, సౌమ్యత, సహజ అందానికి గుర్తు.ఇది మీలోని సున్నిత భావాలకు సూచన.నల్ల లేడి కనిపిస్తే, మీరు మీలోని సున్నిత భావాలను తిరస్కరిస్తున్నట్లు అర్థం.లేడిని చంపుతున్నట్లు కల వస్తే మీలోని సున్నిత భావాలను, దయ, సౌమ్యతను అణిచివేయటానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థం వ‌స్తుంది.

3.ఏనుగు


కలలో ఏనుగు కనిపిస్తే, మీరు ఇతరుల పట్ల ఇంకా ఎక్కువ అవగాహనతో, సహనంతో ఉండాలని అర్ధం.ఏనుగు శక్తి, బలం, తెలివికి చిహ్నం.

అంతేకాక, ఇది మీలోని అంతర్ముఖ వ్యక్తిత్వానికి సూచన కావచ్చు.ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్లు కల వస్తే, మీరు ఒకప్పుడు భయపడిన, మీలోని దాగబడిన అంశాలు మీ నియంత్రణలో ఉన్నాయని అర్థం.

4.మేక


మేక పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోవటాన్ని, అవివేకాన్ని సూచిస్తుంది.మేకపోతు కనిపిస్తే, మీ పోటీదారులు మీవ్యాపారాలను కూల్చివేయటానికి ప్రయత్నిస్తున్నారని అర్థం.

5.గుర్రం


గుర్రం బలమైన భౌతిక శక్తికి సూచన.నల్ల గుర్రం హింస, క్షుద్ర శక్తులకు, తెల్ల గుర్రం స్వచ్ఛత, శ్రేయస్సు అదృష్టానికి సూచన.

చనిపోయిన గుర్రం క‌నిపిస్తే, ఒకప్పుడు మీకు బలం కలిగించింది ఏదో మీ జీవితంలోనుండి పోయిందని, ఇప్పుడు లేదనే దానికి సూచన.అడవి గుర్రాల మంద బాధ్యతా రాహిత్యానికి గుర్తు.

గుర్రం మీద స్వారీ చేస్తూ అది మీనియంత్రణలో ఉంటే, అక్రమ మార్గాల ద్వారా విజయం సాధించడానికి ప్రయత్నిస్తారని, నియంత్రణలోలేని గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటే, మీ కోరికలు మిమ్మల్ని స్థిమితంగా ఉండనీయవని అర్థం.

6.పాము


ఎక్కువమందికి కలలో కనిపించే జంతువులలో పాము కూడా ఒకటి.పాము ప్రమాదకరమైన, నిషిద్ధ లైంగికతకు ప్రతీక.

కలలో పాము కాటు వేస్తే మీలో దాగబడ్డ భయాలు, ఆందోళనలు ఉన్నాయని, అవి మిమ్మల్ని బాగా భయపెడుతున్నాయని అర్థం.ఇది మీరు నిజజీవితంలో ఎదుర్కోబోయే ప్రమాదానికి సూచన కావచ్చు.

కలలో పాము తరుముతుంటే, మీరు వద్దనుకుంటున్న పరిస్థితిలోనే మీరు చిక్కుకోవాల్సి వచ్చిందని, లేక వస్తుందని అర్థం.

7.పంది


పంది మురికి, అత్యాశ, స్వార్థానికి గుర్తు.మీలో ఉన్న స్వార్థాన్ని లేక అత్యాశను వదిలించుకుంటే కానీ విజయావకాశాలు దరి చేరవని అర్థం.

8.గొర్రె


గొర్రె ప్రయత్నలేమిని, చొరవలేనితనాన్ని సూచిస్తుంది.సృజనాత్మకతను పెంచుకొని, కొత్త మార్గాల్లో వెళ్ళటానికి మీరు మొగ్గు చూపరని, నలుగురితోపాటు నారాయణా అనటానికే ఇష్టపడతారని అర్థం.

9.సింహం


సింహం బలానికి, దూకుడుకి, శక్తికి ప్రతీక.మీరు ఇతరులపై ఎక్కువ ప్రభావం చూపుతున్నారని, ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించాలంటే దీనిని నియంత్రించవలసిన అవసరం ఉందని అర్ధం.

సింహం మీపై దాడి చేసినట్లు కల వస్తే, మీరు ఎన్నో అడ్డంకులను అధిగమించవలసిన అవసరం ఉందని సూచిస్తుంది.

10.పులి


పులి శక్తికి, వివిధ పరిస్థితులను ఎదుర్కోవటానికి కావలసిన మీ సామర్థ్యానికి, నాయకత్వ లక్షణానికి సూచన.బోనులో ఉంచబడిన పులి అణచివేయ‌బడిన భావోద్వేగాలకు, దాడి చేస్తున్న పులి, ఆ భావోద్వేగాల వల్ల కలిగే భయానికి గుర్తు.

11.తాబేలు


తాబేలు మీరు జీవితంలో ముందుకు పోవడానికి అవకాశాలు వెతుక్కోవలసిన అవసరాన్ని సూచిస్తుంది.మీకు ఎదగటానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి, కానీ దాని కోసం సరి అయిన అడుగు వేయాలని సూచిస్తుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube