తన అత్తని హాగ్ చేసుకోవడానికి ఈ బుడ్డది ఎయిర్ పోర్ట్ లో ఏమి చేసిందంటే..?!

What Did This Baby Do To Hug Her Aunt In Airport

సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటూనే ఉంటుంది.మరి ముఖ్యంగా చిన్న పిల్లల వీడియోల గురించి అయితే చెప్పనవసరమే లేదు.

 What Did This Baby Do To Hug Her Aunt In Airport-TeluguStop.com

ఎందుకంటే చిన్న పిల్లలు ఏది చేసినాగాని చూడ ముచ్చటగానే ఉంటుంది.వారు చేసే అల్లరి పనులు, చిలిపి చేష్టలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి.

పిల్లల నవ్వు చూస్తే చాలు ఎటువంటి టెన్షన్స్ అయినాగానీ ఇట్టే మాయం అయిపోతాయి.పిల్లలు ఉన్న ఇంట్లో ఉండే సందడే వేరు కదా.మనం ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చి టాటా, బై బై అని చెప్పి మనల్ని హత్తుకుని ఒక ముద్దు పెట్టి నాకు వచ్చేటప్పుడు చాక్లెట్ తెమ్మని అడిగే తీరు చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది కదా.

 What Did This Baby Do To Hug Her Aunt In Airport-తన అత్తని హాగ్ చేసుకోవడానికి ఈ బుడ్డది ఎయిర్ పోర్ట్ లో ఏమి చేసిందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఒక చిన్ని పాప కూడా అచ్చం వెళ్లిపోతున్నా తన అంటీకి సెండ్ ఆఫ్ ఇచ్చింది.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.పాప సెండ్ ఆఫ్ ఇవ్వడంలో ఆశ్చర్యం ఏముంది అని అనుకుంటున్నారా.పాప ఎయిర్ పోర్ట్ లో తన అంటీకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ పర్మిషన్ అడిగే తీరు చూస్తేనే చాలా క్యూట్ గా ఉంటుంది.అందుకే ఈ వీడియో నెటిజెన్ల మనసును దోచుకుని సోషల్ మీడియాలో అంత వైరల్ అయింది.

ఈ వీడియో గురించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఖతార్‌ లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది.వీడియో ప్రకారం ఒక మహిళ విదేశాలకు వెళ్తుంటే ఆమెకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఆమె కుటుంబ సభ్యులు కూడా ఎయిర్ పోర్ట్ కు వచ్చారు.వాళ్లలో ఒక చిన్న పాప కూడా ఉంది.

అయితే విదేశాలకు వెళ్లే ఆమె సెక్యూరిటీ గార్డ్ వద్ద అన్ని ఫార్మాల్టీస్ పూర్తి చేసుకొని లోపలకు వెళ్లగా ఇంతలో ఒక చిన్న పాప వచ్చి రాని మాటలతో అక్కడ ఉన్న సెక్యూరిటీ పాయింట్ దగ్గర నుంచిని ఉన్న సెక్యూరిటీని మా అంటీని ఒకసారి హాగ్ చేసుకోవాలి కొంచెం అనుమతి ఇవ్వరా ప్లీజ్ అని అడిగి బుడి బుడి అడుగులతో కేరింతలు కొడుతూ పరుగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ అత్తని ఆప్యాయంగా కౌగలించుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ చిన్నారిని చూసిన ప్రతి ఒక్కరూ సో క్యూట్ అంటూ పాపని అభినందిస్తున్నారు.

#Qatar #Cute #Airport #Security Guard #Baby Hug Aunt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube