తనకు చికిత్స చేసిన డాక్టర్ కనబడగానే ఆ ఏనుగు ఏం చేసిందంటే?

ప్రస్తుత ప్రపంచంలో మానవ సంబంధాలు అనేవి ఎంత క్షీనించాయో మనం చూస్తూ ఉన్నాం.కంప్యూటర్ కాలం కావున అందరూ తోటి మనుషులతో మాట్లాడడం మానేసి సోషల్ మీడియాలలో మునిగి తేలుతున్నారు.

 Thailand Elephant Identifies The Doctor Who Treated Him Years Ago , Viral News ,-TeluguStop.com

దీంతో మనుషుల మధ్య ప్రేమానుబంధాలు, ఆప్యాయతలు తగ్గిపోయాయి.అందుకే ఇప్పుడు చాలా మంది పెంపుడు జంతువులను ఇంట్లో పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో మనుషులలో విశ్వాసం తగ్గిపోయిన పరిస్థితులలో మనుషుల కంటే ఎక్కువ విశ్వాసం కలిగినవి జంతువులు కాబట్టి జంతువులను పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.వాటిని జంతువులలా కాకుండా ఇంట్లో మనిషిలా వాటిని ప్రేమిస్తున్నారంటే మనుషులు జంతువుల పట్ల ఎంత ఇష్టం కలిగి ఉన్నారో మనం అర్ధం చేసుకోవచ్చు.

అంతే జంతువులు కూడా అంతే విశ్వసాన్ని కలిగి ఉంటాయి.తమకు సహాయం చేసిన వారి పట్ల అత్యంత విశ్వాసాన్ని కలిగి ఉంటాయి.

అవి ఆ వ్యక్తి పట్ల ఉన్న నిష్కల్మష ప్రేమను తెలియజేస్తుంది.ఇక అసలు విషయంలోకి వస్తే థాయిలాండ్ లో 31 ఏళ్ల వయసున్న ఫ్లాగథాన్ అనే ఏనుగు తనకు 12 ఏళ్ల క్రితం అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించి ప్రాణాపాయం నుండి కాపాడిన పట్టారాపోల్ మనియోన్ అనే వైద్యుడు కనబడడంతో అతని దగ్గరకు తనంతట తానుగా వెళ్లి తొండంతో నిమురుతూ కృతజ్ఞత పూర్వకమైన ప్రేమను తెలియజేసింది.

అయితే ఈ ఘటనపై స్పందించిన ఆ వైద్యుడు నేను డ్యూటీలో భాగంగా వెళ్ళినప్పుడు తనంతట తానుగా నా దగ్గరికి వచ్చిందని తెలిపారు.ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఈ ఘటన పట్ల నెటిజన్లు ఏనుగు చేసిన పనికి ముగ్దులైపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube