ఫేమస్ అవడం కోసం ఓ ప్రియుడు ప్రియురాలిని ఏం చేశాడంటే?

సోషల్‌ మీడియా పుణ్యమాని చాలా మంది ప్రతిభ ఉన్న వారు చాలా త్వరగా పాపులర్ అయి జీవితంలో సెటిల్ అయినవారున్నారు.అయితే, సహజ సిద్ధంగానే వ్యక్తుల టాలెంట్, కళ ప్రజల్లోకి వెళ్తే తద్వారా పాపులర్ అవడం మంచిదే.

 What Did A Boyfriend Do To His Girlfriend To Become Famous-TeluguStop.com

కానీ, కావాలనే ఏదో ఒక వింత పని చేసి పాపులర్ అవుదాం అనుకోవడం ఓ రకంగా రిస్కే.ఇలాంటి ఆలోచన చేశాడు ఓ వ్యక్తి.

ఫేమస్ అవాలని భావించి తన ప్రియురాలిని హింసకు గురి చేశాడు.ఈ నేపథ్యంలోనే పోలీసులు అతడికి ఫైన్ విధించారు.

 What Did A Boyfriend Do To His Girlfriend To Become Famous-ఫేమస్ అవడం కోసం ఓ ప్రియుడు ప్రియురాలిని ఏం చేశాడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ అతడు ఏం చేశాడంటే.

రష్యా నివాసి అయిన సెర్గీ సోషల్ మీడియాలో బాగా పాపులర్ ఇన్ ఫ్లుయెన్సర్.

ఇన్ స్టా‌గ్రామ్‌లో సెర్గీ పెట్టే ప్రతీ వీడియోకు వేల సంఖ్యలో లైక్స్ కామెంట్స్ వస్తుంటాయి.ఈ క్రమంలో ఇంకా పాపులర్ కావాలని భావించి ఓ వింత పని చేశాడు సెర్గీ.

ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్గీకి 50 మిలియన్) ఫాలోవర్స్‌ ఉన్నప్పటికీ అవి సరిపోవని భావించే ఈ డిఫరెంట్ చర్యకు పూనుకున్నట్లు తెలుస్తోంది.సెర్గీ తన ప్రియురాలిని కాళ్లు చేతులు కట్టేసి కారు టైప్ పైన ఉంచి ఊరేగించాడు.

ఇందుకు సంబంధించి వీడియో రికార్డు చేసి మరీ ఇన్ స్టా వేదికగా షేర్ చేశాడు.ఈ వీడియో చూసి నెటిజనాలు షాక్ అయ్యారు.ప్రేమించిన అమ్మాయిని ఇలా చేయడమేంటని ప్రశ్నించారు కొందరు.అసలు ఇది నువ్వు చేయాల్సిన పనేనా? అని అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నువ్వు ఇలా చేయడం సబబు కాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ వీడియో ఆధారంగా పోలీసులు ఈ విషయమై విచారణ జరిపి సెర్గీకి భారీ ఫైన్ విధించారు.

ఫేమస్ అవడం కోసం ఇలా చేయడం సరికాదని హెచ్చరించారు.

#Sergei #Instagram #Influencer #Lover #Russian

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు