ధోని చెప్పినట్లే చేసి నిరూపించాడు: మాజీ సెలెక్టర్ సంజయ్

మహేంద్రసింగ్ ధోని.ఇది పేరు మాత్రమే కాదు ఒక బ్రాండ్. టీమిండియా క్రికెట్ జట్టుకు ఎన్నో మర్చిపోలేని విజయాలను అందించిన గొప్ప వ్యక్తి మహేంద్రసింగ్ ధోని.2007 సంవత్సరంలో జరిగిన టి20 వరల్డ్ కప్ కంటే ముందు టీమిండియా జట్టును ఎంపిక చేసే సమయంలో ధోని చెప్పిన మాటను నిలబెట్టుకున్న ట్లు మాజీ సెలెక్టర్ సంజయ్ తెలియజేశారు.ఆయన మాట్లాడుతూ అలనాటి విషయాలను ఆయన గుర్తు చేశారు.ఆ సమయంలో తాను టీమిండియాకు సెలెక్టర్ గా కొనసాగుతుండగా మొట్టమొదటి టి20 ప్రపంచ కప్ టోర్నీకి అప్పటికే దిగ్గజ ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్న సచిన్ లాంటి వాళ్లను ఎంపిక చేయవద్దని స్వయంగా తెలియజేశాడు.

 Ms Dhoni, Sanajay, Bcci Selector, World Cup, Mahendra Singh Dhoni, Team India Cr-TeluguStop.com

ఈ విషయంతో కేవలం యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా జట్టును ఎంపిక చేసినట్లు అందుకు మహేంద్ర సింగ్ ధోనీ మొట్టమొదటిసారిగా కెప్టెన్ గా చేశామని ఆయన చెప్పుకొచ్చారు.టీమ్ సెలక్షన్ తర్వాత ఇదో మంచి జట్టు అని తాను అప్పట్లో ధోనీతో మాట్లాడినట్లు సంజయ్ తెలిపారు.

అయితే ఈ విషయంపై మహేంద్ర సింగ్ ధోనీ అప్పట్లో మాట్లాడుతూ.తాము కచ్చితంగా ప్రపంచ కప్ గెలిచి కప్పును తీసుకువస్తామని చెప్పినట్లు ఆయన వివరించారు.

Telugu Bcci, Sanjay, Mahendrasingh, Msdhoni, Sanajay, Cup, India Cricket-Latest

ఆ మాటతో సెలక్షన్ కమిటీ సభ్యులందరూ ఆశ్చర్యపోయానని తెలియజేశారు.అప్పటికే 2007లో టీమ్ ఇండియా జట్టు రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో ప్రపంచకప్ లో ఘోర ఓటమి ఎదుర్కొన్న సంగతి కారణంగా ఆ తర్వాత జరిగిన తొలి ట్వంటీ20 ప్రపంచ కప్ లో భాగంగా కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకొని టీం ను సెలెక్ట్ చేసినట్లు తెలిపాడు.అలా పంపిన టీమిండియా జట్టు మొత్తానికి ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచి కప్పును సాధించింది.దాంతో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో చెప్పింది చేశారని సంజయ్ తెలియజేశారు.

ఆ టీ 20 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ లో మహేంద్రసింగ్ ధోని శకం మొదలైంది.ఆ తర్వాత ఒక దాని తర్వాత ఒకటి సిరీస్ ను గెలిచి చివరికి టీమిండియా జట్టును మొదటి స్థానానికి చేర్చగలడు.

ఇదే క్రమంలో 2011లో వన్డే ప్రపంచకప్, ఆ తర్వాత 2013 లో చాంపియన్స్ ట్రోఫీ, 2014లో టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు చేరుకోవడం, 2015 వన్డే ప్రపంచ కప్ సెమీస్ వరకు చేరుకోవడం, 2016 టీ 20 ప్రపంచ కప్ లో సెమీస్ చేరడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి తన క్రికెట్ ప్రస్థానాన్ని కొనసాగించి ఈ సంవత్సరంలో ధోని రిటైర్డ్ అయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube