ప్రస్తుతం కేరళ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. 80 శాతానికి పైగా కేరళ భారీ వర్షాలకు, వరదలకు మునిగిపోయింది. దీంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. నిరాశ్రయులందరినీ పునరావాస కేంద్రాల్లోకి తరలించారు. వరదలకు అతలాకుతలమవుతున్న కేరళ రాష్ర్టాన్ని ఆదుకోవడానికి ప్రధాని మోదీ తక్షణ సాయం కింద రూ.500 కోట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు, బీహార్ ప్రభుత్వం 10 కోట్లు, హర్యానా ప్రభుత్వం 10 కోట్లు ప్రకటించారు. ఎస్బీఐ కూడా తన వంతు సాయంగా 2 కోట్లను సీఎం సహాయనిధికి ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఇది ఇలా ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి దయనీయ పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు. మరి పరిస్థితి ఎందుకింత తీవ్రంగా మారింది? దానికి కారణాలు ఏంటి.? మీరే చూడండి!
1. సాధారణంగా ఏటా కేరళలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంటుంది. కానీ ఈసారి సాధారణ స్థాయి కంటే 37శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. 2. అడవుల నరికివేతను నివారించలేకపోవడం, 3. పర్వత ప్రాంతాలను సంరక్షించలేకపోవడం ఈ పరిస్థితికి కారణమని పర్యావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. 4. అంతేకాదు దీనికి తోడు పొరుగు రాష్ట్రాల వల్ల కూడా పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొద్ది రోజుల ముందు ఓ డ్యామ్ నుంచి నీటి విడుదల విషయమై తమిళనాడు ముఖ్యమంత్రికి, విజయన్‌కు మధ్య మాటల యుద్ధం జరిగింది. 5. కేరళ నుంచి 41 నదులు అరేబియా మహా సముద్రంలో కలుస్తాయి. వాటిపైన ఉన్న 80 డ్యామ్‌ల గేట్లను ఎత్తేసినట్లు తెలుస్తోంది