లోకేష్ బాబు కి చంద్రబాబు కళ్ళెం

ఏపీ సీఎం చంద్రబాబు లోకేష్ ని లోకేష్ చుట్టూ ఉన్న కోటరీని ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నారా.? ఆ దిశగా ఇప్పటికే బాబు యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారా అంటే అవుననే చెప్పాలి.అసలు ఎందుకు లోకేష్ విషయంలో చంద్రబాబు ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అంటే లోకేష్ ఈ విషయాలు డీల్ చేయలేకపోతున్నారని ఇప్పటికే బాబు దగ్గర పక్కా రిపోర్ట్ ఉందట దాంతో రంగంలోకి దిగిన బాబు ఒక్కొక్కరిని ఉతికి ఆరేస్తున్నారట.లోకేష్ ని అడ్డం పెట్టుకుని ఆయన పరువుని చెడగొట్టే పని పెట్టుకున్న వారి మొదలు.

 What Are Your Thoughts About Nara Lokesh-TeluguStop.com

లోకేష్ మంత్రిత్వశాఖ ని చిన్నా భిన్నం చేసిన అధికారుల వరకూ అందరిని వరుసపెట్టి రేవు పెడుతున్నారట.

అయితే అసలు విషయంలోకి వెళ్తే …మంత్రి హోదాలో పాలానాపరమైన విధానమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో నారా లోకేష్‌ను ఎమ్మెల్సీ.కేంద్ర పార్టీ కార్యాలయ ఇన్‌ఛార్జి జనార్ధన్‌ లోకేష్ పరుని బజారుకి ఈడ్చడమే కాకుండా ఆయన ప్రతిష్టను మంటగలుపుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వచ్చింది.అయితే పంచాయితీ పంచాయితీ కార్యదర్శుల నియామకంలో అవుట్ సోర్సింగ్ ద్వారా నియామకాలు చెప్పట్టాలని అనుకోవడం ఎంతో తప్పిదం అయితే పంచాయితీ రాజ్ కార్యదర్శి ఆశాఖాధిపతి, కమీషనర్‌ తప్పుడు సలహాలు విని.

అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా పంచాయితీ కార్యదర్శులను నియమించేందుకు నిర్ణయం తీసుకోవడం ఆ ఉత్తరువులు కూడా జారీ చేయడం వలన పెద్ద దుమ్మారం రేగింది.

అయితే ఈ విషయాన్ని మంత్రి లోకేష్‌కు చెప్పాల్సిన పంచాయితీరాజ్‌ కార్యదర్శి ఆయనను తప్పుదోవ పట్టించి.

లోకేష్ ని మేధావుల ముందు పరువు పోయేలా చేశారు.అంతేకాదు ఈ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాల్లో, పైళ్ల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంలో మంత్రి లోకేష్‌ సరైన రీతిలో వ్యవహరించలేకపోతున్నారు.

అంతే కాకుండా సీనియర్‌ రాజకీయనాయకుల వారుసులను.ప్రజల్లో కార్యకర్తల్లో వ్యతిరేకతను ఎదుర్కుంటున్న వారిని లోకేష్ తన చుట్టూ ఉంచుకోవడం కూడా లోకేష్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నట్లుగా ఉంటోంది.

ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ టి.డి.జనార్థన్‌ను పార్టీ కార్యాలయ ఇన్‌ఛార్జిగా తొలగించాలని ‘చంద్రబాబు’ నిర్ణయం తీసుకున్నారట.

లోకేష్ ని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నది ఆయనే అని భావించిన బాబు ఆయన్ని సాగనంపాలని డిసైడ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా…అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు పార్టీలో వివిధ హోదాలో పనిచేస్తోన్న నాయకుల సిఫార్సులను లోకేష్‌ చేసే సిఫార్సులను పరిగణలోకి తీసుకోరని సీనియర్‌ నాయకులు నమ్ముతున్నారు అసలే లోకేష్ పార్టీకి కాబోయే నాయకుడు ముఖ్యమంత్రి అభ్యర్ధి కూడా ఈ తరుణంలో లోకేష్ చుట్టూ ఉండే కోటరీని గనుకా ప్రక్షాళన చేయకపోతే మాత్రం మొదటికే మోసం వస్తుందని బాబు తెగ టెన్షన్ పడుతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube