మీరేంటి మీరు చేసే పనులేంటి.. శివాని రాజశేఖర్ కు నెటిజన్ ప్రశ్న?

మామూలుగా ఒకప్పుడు సెలబ్రెటీలకు, అభిమానులకు మధ్య చాలా గ్యాప్ ఉండేది.కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు.

 What Are You And What Do You Do Netizens Question To Shivani Rajasekhar,  Www Mo-TeluguStop.com

ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండటం వల్ల సెలబ్రెటీలకు, అభిమానులకు మధ్య దూరం అనేది తగ్గి కమ్యూనికేషన్ పెరిగింది.ఇక సెలబ్రెటీలకు,  సామాన్యులకు సోషల్ మీడియా ఖాతాలు ఉండటం వల్ల ద్వారా ఇద్దరి మధ్య సంభాషణ నడుస్తుంది.

సెలబ్రెటీలు కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా తమ ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతూ ఉంటారు.అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటారు.

అయితే తాజాగా శివాని రాజశేఖర్ కు కూడా తన అభిమాని ఒక ప్రశ్న అడిగాడు.ఇంతకు అదేంటో తెలుసుకుందాం.

శివాని రాజశేఖర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రముఖ స్టార్ హీరో రాజశేఖర్, జీవితల పెద్దకూతురు.

ఇక చిన్న కూతురు శివాత్మిక కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయమైన సంగతి తెలిసిందే.ఇక శివాని రాజశేఖర్ కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.

అతి తక్కువ సమయంలో తన నటనతో మంచి మార్కులు సంపాదించుకుంది ఈ బ్యూటీ.

శివాని రాజశేఖర్ 2018లో 2 స్టేట్స్ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.

అదే ఏడాది వివి స్టూడియోస్ అనే తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది.ఇక ఆ సినిమాలతో తనకు మంచి సక్సెస్ రావటంతో ఆ తర్వాత అద్భుతం, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సినిమాలతో పాటు పలు తమిళ   సినిమాలలో కూడా నటించింది.

గత ఏడాది శేఖర్ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Telugu Jeevitha, Ups, Netizens, Rajasekhar, Studios, Www-Movie

ఆహా నా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ కూడా చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ బ్యూటీ అంతగా పేరు తెచ్చుకోలేక పోతుంది.నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకున్నప్పటికీ కూడా ఈ బ్యూటీకి సక్సెస్ అనేది మాత్రం రాలేకపోతుంది.

ప్రస్తుతం సక్సెస్ కోసం బాగా ఎదురుచూస్తుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలను కూడా పంచుతూ షాక్ ఇస్తుంది.

ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తాను కొన్ని ఫోటోలు పంచుకుంది.ఇక ఆ ఫోటోలు వైరల్ అవ్వగా తన ఫాలోవర్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.

అంతేకాకుండా కామెంట్ లు కూడా పెడుతున్నారు.ఓ నెటిజన్ మాత్రం.

నిజంగా మీ రేంజ్ ఏంటి మీరు చేసే సినిమాలు ఏంటి.మీ దగ్గర నుండి పెద్ద సినిమాలు కోరుకుంటున్నాము.

కాబట్టి మంచి సినిమాలు సెలక్షన్ చేసుకోండి అని సలహా ఇవ్వగా ప్రస్తుతం ఆ సలహా వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube