హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపుకు టీఆర్ఎస్ వేసిన మూడు వ్యూహాలు ఇవే?

What Are The Three Strategies Used By Trs To Win The Huzurabad By Election

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశం రాజకీయంగా హీటెక్కుతోంది.ప్రస్తుతం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

 What Are The Three Strategies Used By Trs To Win The Huzurabad By Election-TeluguStop.com

అయితే దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ఎలాగైతే రాజకీయ వాతావరణం వేడెక్కిందో ప్రస్తుతం అదే రీతిలో పెద్ద ఎత్తున రకరకాల ట్విస్ట్ లతో హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయం కూడా ఉన్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ లతో పోలిస్తే టీఆర్ఎస్ కు ఈ ఉప ఎన్నిక గెలుపు చాలా ప్రతిష్టాత్మకమైనదన్న విషయం తెలిసిందే.

ఆయితే గత 20 సంవత్సరాలుగా టీఆర్ఎస్ కంచుకోటగా ఉంటూ వస్తున్న హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓటమి పాలైతే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ తగిలినట్టు అవుతుంది.

 What Are The Three Strategies Used By Trs To Win The Huzurabad By Election-హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపుకు టీఆర్ఎస్ వేసిన మూడు వ్యూహాలు ఇవే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Bjp Party, By-polls In Huzurabad, Congress Party, Kcr, Trs Party-Political

అందుకే సరిగ్గా హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో కెసీఆర్ వేసినమూడు వ్యూహాలతో టీఆర్ఎస్ విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.అయితే మొదటగా దళిత బంధును ఎన్నికల కమిషన్ నిలిపివేసేలా ఆ తరహా వాతావరణాన్ని ఇతర ప్రతిపక్షాలు తప్పు పట్టేలా తయారు చేయడం, ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించటం, ఆ తరువాత హుజూరాబాద్ బహిరంగ సభ ఇలా మూడింటితో ప్రతిపక్షాల విమర్శలను చాలా బలంగా తిప్పికొట్టే అవకాశం ఉంది.దీంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ అనుకూల వాతావరణం అనేది హుజూరాబాద్ నియోజకవర్గంలో అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడే అవకాశం వందకు వంద శాతం ఉంది.

మరి ఈ మూడు వ్యూహాలు కనుక ఖచ్చితంగా ఇతర పార్టీలపై ప్రభావం చూపితే మాత్రం హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపూ చాలా సునాయాసంగా ఉండే అవకాశం ఉంది.మరి రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది.

#Trs #Huzurabad #Bjp #Congress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube