మైగ్రేన్ త‌ల‌నొప్పికి కార‌ణాలు.. లైట్ తీసుకుంటే రిస్క్ త‌ప్ప‌దు!  

what are the reasons of migraine headache! reasons of migraine headache, migraine headache, health tips, headache, health, latest news, good health, - Telugu Good Health, Headache, Health, Health Tips, Latest News, Migraine Headache, Reasons Of Migraine Headache

నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో చాలా మంది మైగ్రేన్ త‌ల‌నొప్పితో బాధ ప‌డుతున్నారు.మైగ్రేన్ త‌ల‌నొప్పినే పార్శ్వపు నొప్పి అని కూడా అంటారు.

TeluguStop.com - What Are The Reasons Of Migraine Headache

ఈ మైగ్రేన్ త‌ల‌నొప్పిని భ‌రించ‌డం చాలా క‌ష్టం.త‌ల‌నొప్పి కంటే తీవ్రంగా ఉండే మైగ్రేన్‌.

ఎంద‌రినో ముప్ప తిప్ప‌లు పెడుతోంది.ఇక మైగ్రేన్ త‌ల‌నొప్పిని త‌ట్టుకోలేక‌ హాస్ప‌ట‌ల్స్ చుట్టూ తిరుగుతూ ఏవేవో మందులు వాడుతుంటారు.

TeluguStop.com - మైగ్రేన్ త‌ల‌నొప్పికి కార‌ణాలు.. లైట్ తీసుకుంటే రిస్క్ త‌ప్ప‌దు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కానీ, అస‌లు మైగ్రేన్ త‌ల‌నొప్పికి కార‌ణాలు ఏంటీ ? ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఈ మాయ‌దారి వ్యాధి నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు ? అన్న వాటిపై శ్ర‌ద్ధ చూప‌రు.

అయితే వాస్త‌వానికి మైగ్రేన్ త‌ల‌నొప్పికి చాలా కార‌ణాలు ఉన్నాయి.

త‌ర‌చూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవడం, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం, హార్మోన్ల సమస్యలు, ఎక్కువసేపు ఎండలో ఉండడం, మ‌ద్యం అల‌వాటు, స్మోకింగ్‌, కెఫిన్ ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, మాన‌సిక ఆందోళ‌న ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మైగ్రైన్ వ్యాధి బారిన ప‌డుతుంటారు.

అలాగే కొంద‌రిని వంశపారంపర్యంగా కూడా మైగ్రేన్ స‌మ‌స్య వ‌స్తుంది.ఇక ఈ మైగ్రేన్ వ్యాధి వ‌చ్చిందంటే తట్టుకోలేనంతగా తలనొప్పి వ‌స్తుంది.ముఖ్యంగా త‌ల‌కు ఒక‌వైపు తీవ్ర‌మైన నొప్పి పుడుతుంది.

ఏ పనిని చేయ‌లేక‌పోతుంటారు.ప్ర‌శాంతంగా ఉండ‌లేరు.

కొందరికి వాంతులు, వికారంగా ఉండ‌టం, క‌ళ్లు తిర‌గ‌డం, అల‌స‌ట‌, ముఖం పాలిపోవడం, చికాకు, కాళ్ళు చేతులు చల్లబడడం ఇలా అనేక ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

Telugu Good Health, Headache, Health, Health Tips, Latest News, Migraine Headache, Reasons Of Migraine Headache-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

ఇలా జ‌రిగితే ఖ‌చ్చితంగా వైద్యులు సంప్ర‌దించాలి.అలాగే మైగ్రేన్‌కు కార‌ణ‌మ‌య్యే విష‌యాల్లో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

పోష‌కాహారం తీసుకోవ‌డం పాటు ప్ర‌తి రోజు వ్యాయామం, యోగా చేయాలి.త‌గినంత నిద్ర‌పోవాలి.

ఒత్తిడికి మ‌రియు చెడు అల‌వాట్ల‌కు దూరంగా ఉండాలి.

#ReasonsOf #Health #Headache #Health Tips #Good Health

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు