కొలెస్ట్రాల్ పెర‌గ‌డానికి ఇవీ కార‌ణాలే అని మీకు తెలుసా?

కొలెస్ట్రాల్ లో మంచి కొలెస్ట్రాల్ ఒక‌టైతే , చెడు కొలెస్ట్రాల్ మ‌రొక‌టి.గుండె ఆరోగ్యాన్ని పెంచ‌డంలో మంచి కొలెస్ట్రాల్ స‌హాయ‌ప‌డితే.

 What Are The Reasons Of Increase Bad Cholesterol! Increase Bad Cholesterol, Bad-TeluguStop.com

గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బుల‌ను తెచ్చిపెట్ట‌డంలో చెడు కొలెస్ట్రాల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.అందుకే చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవ‌డం ఎంతో అవ‌స‌ర‌మ‌ని నిపుణులు చెబుతుంటారు.

కానీ, ఈ మ‌ధ్య చాలా మందిలో బ్యాడ్ కొలెస్ట్రాల్ రోజు రోజుకు పెరిగి పోతోంది.దాంతో గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది.

కొలెస్ట్రాల్ దానంత‌ట అదే పెరుగుతుందా అంటే కానే కాదు.తెలిసో, తెలియ‌కో మ‌నం చేసే త‌ప్పులే కొలెస్ట్రాల్ పెర‌గ‌డానికి కార‌ణాలు.

మ‌రి ఆ త‌ప్పులు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.శ‌రీరం లో కాల్షియం డైట్  కొలెస్ట్రాల్ పెర‌గ‌డానికి ఒక కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.

సాధార‌ణంగా ఎముక‌లు, దంతాలు, కండ‌రాలు బ‌లంగా ఉండాలంటే కాల్షియం ఎంతో అవ‌రం.అలాగే చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉండాల‌న్నా కాల్షియం కావాల్సి ఉంటుంది.

శ‌రీరానికి స‌రిప‌డా కాల్షియం తీసుకోనెటప్పుడు కొలెస్ట్రాల్ స్థాయి కూడా అదుపు త‌ప్పుతుంది.

Telugu Bad Cholesterol, Effectsbad, Cholesterol, Tips, Healthy Heart, Heart, Lat

అలాగే చాలా మంది రెగ్యుల‌ర్‌గా మాంసాహారాలు తింటుంటారు.నాన్ వెజ్ అధికంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ క్ర‌మంగా పెరుగుతుంది.కాబ‌ట్టి, వారంలో ఒక‌టి, రెండు సార్లు కంటే ఎక్కువ‌గా మాంసాహారాలు తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది.

ఒత్తిడి వ‌ల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది.అందుకే ఒత్తిడిని ఎంత త‌గ్గించుకుంటే కొలెస్ట్రాల్ అంత అదుపులో ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

తక్కువ ఫైబ‌ర్ ఫుడ్ తీసుకోవ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది.అందు చేత‌, రెగ్యుల‌ర్ డైట్‌లో ఖ‌చ్చితంగా ఫైబ‌ర్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి.ఇక అధిక బ‌రువు, బేకరీ ఆహార పదార్థాలు ఓవ‌ర్‌గా తీసుకోవ‌డం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, ధూమ‌పానం, మ‌ద్య‌పానం, ఆరోగ్యకరమైన కొవ్వులకు దూరంగా ఉండటం, వ్యాయామాలు చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube