వినీత్.ఈ పేరు ఈ జెనరేషన్ పిల్లలకు అంతగా తెలియదు కానీ.నైంటీస్ లో వారికి మాత్రం బాగా తెలుసు.ప్రేమదేశం సినిమాతో కనీవినీ ఎరుగని రీతిలో ఇమేజ్ తెచ్చుకున్నాడు ఈ బక్కపలుచని అబ్బాయి.ఈ సినిమాతో హీరో వినీత్ తో పాటు అబ్బాస్ సూపర్ పాపులర్ అయ్యాడు.అయితే ఈ పాపులారిటీని ఎక్కువ కాలం నిలుపుకోలేక పోయాడు.
దీనికి కారణాలు చాలా ఉన్నాయి.నిజానికి ఇతడికి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది.
అయితే తను మలయాళీ కావడంతో తెలుగు భాషపై పట్టులేదు.సుమన్, భానుచందర్, రాజశేఖర్ లా డబ్బింగ్ చెప్పించుకోడానికి వీలున్నా, క్లాస్ పాత్రలు తప్ప మాస్ రోల్స్ కి సరిపోలేదు.
పైగా నటి శోభన బ్రదర్ అయినప్పటికీ ఆమె నుంచి రికమండేషన్ అసలు ఆశించలేదు.అతడి మేనత్త సుకుమారి ఉన్నా సరే.ఆమె పేరు చెప్పి లాభపడాలని వినీత్ ఏనాడూ భావించ లేదు.
నిజానికి వినీత్ క్లాసికల్ డాన్సర్.
దీంతో ఆయనకు లవర్ బాయ్ కథలు, డాన్సర్ కథలు ఎక్కువగా వచ్చేవి.తెలుగులో సరిగమలు మూవీతో ఆయన ఎంట్రీ ఇచ్చాడు.
సినిమా బాగున్నా సక్సెస్ కాలేదు.దీంతో తెలుగులో నమ్మకం పెట్టుకోలేదు.
అయితే ప్రేమదేశం మూవీతో స్టార్ హీరోగా మారిపోయాడు.టబు హీరోయిన్ గా అబ్బాస్, వినీత్ హీరోలుగా వచ్చిన ఈ మూవీ యూత్ ని ఆకట్టుకుంది.
దీంతో తెలుగు సినిమా పరిశ్రమలో వినీత్ ఆశలు చిగురించాయి.స్వశక్తితో ఎదగాలన్న ప్రయత్నం ఫలించింది.
వరుస ఆఫర్లు రావడంతో పది సినిమాలు చేసాడు.
ప్రేమపల్లకి, ఆరోప్రాణం, రుక్మిణి, వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్, పాడుతా తీయగా, ఇలా వరుస సినిమాలు చేసేసిన వినీత్ కి ఇందులో ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ పెద్దగా విజయం సాధించలేదు.
ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి లాహిరి లాహిరిలో, బాపు బొమ్మకు పెళ్ళంట సహా పలు సినిమాల్లో నటించాడు.అయినా పెద్దగా ఉపయోగపడలేదు.అదే సమయంలో మలయాళంలో సక్సెస్ లు అందుకోవడంతో అక్కడ అవకాశాలు వచ్చాయి.సుమారు 15 ఏళ్ల తర్వాత నితిన్ మూవీ రంగ్ దే లో వినీత్ దర్శనం ఇవ్వడం విశేషం.