ఐపీఎల్: ఫ్రాంఛైజీలో రిటెన్షన్ బడ్జెట్ రూల్స్ ఇవే!

What Are The Players Retention Budget Rules For Ipl Franchises

ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో రెండు కొత్త ఫ్రాంచైజీలు చేరనున్నాయి.కొత్త ఫ్రాంఛైజీలతో పాటు ఈసారి ఐపీఎల్ 2022 ఎడిషన్‌లో అనేక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

 What Are The Players Retention Budget Rules For Ipl Franchises-TeluguStop.com

ముఖ్యంగా ఫ్రాంఛైజీల ప్లేయర్లు మారనున్నారు.ఈసారి ఆటగాళ్ల రిటెన్షన్ విషయంలో ఫ్రాంచైజీలకు కొన్ని రూల్స్ కూడా విధించింది బీసీసీఐ.

రూల్స్ ప్రకారం నవంబర్ 30 లోగా ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ప్లేయర్ల జాబితాను సమర్పించాల్సి ఉంటుంది.ప్రస్తుతం ఉన్న జట్లు ముగ్గురు నుంచి నలుగురు వరకు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు.

 What Are The Players Retention Budget Rules For Ipl Franchises-ఐపీఎల్: ఫ్రాంఛైజీలో రిటెన్షన్ బడ్జెట్ రూల్స్ ఇవే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మెగా వేలం నిర్వహణకు ముందు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే ఫ్రాంచైజీ.ఇద్దరు భారత ఆటగాళ్లను, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.

అయితే కావాలనుకుంటే ప్రాంఛైజీలు ముగ్గురు భారత ఆటగాళ్లను, ఒక విదేశీ ఆటగాన్ని అంట్టిపెట్టుకోవచ్చు.ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడాన్ని బట్టి రిటెన్షన్ బడ్జెట్‌ను బీసీసీఐ నిర్ణయించింది.ఆ బడ్జెట్‌ను ఎలా నిర్ణయించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

– నలుగురు ప్లేయర్లను రిటైన్ చేస్తే.రూ.42కోట్లు (రూ.16కోట్లు, రూ.12కోట్లు, రూ.8కోట్లు, రూ.6కోట్లు) ఖర్చు చేయాల్సి ఉంటుంది.మొత్తం పర్సు వాల్యూ రూ.90 కోట్లు.నలుగురు ఆటగాళ్ల రిటెన్షన్ నిమిత్తం రూ.42 కోట్లు పోగా ఫ్రాంఛైజీల వద్ద రూ.48 కోట్లు వేలం కోసం మిగిలి ఉంటాయి.

Telugu Budget, Ipl Franchises, Latest, Ups-Latest News - Telugu

– ముగ్గురు ప్లేయర్లను రిటైన్ చేస్తే. మొత్తంగా రూ.33కోట్లు (రూ.15కోట్లు, రూ.11కోట్లు, రూ.7కోట్లు) ఖర్చు చేయాల్సి ఉంటుంది.అప్పుడు ఫ్రాంఛైజీల వద్ద రూ.57 కోట్లు మిగిలి ఉంటాయి.

– ఇద్దరు ప్లేయర్లను రిటైన్ చేస్తే. మొత్తంగా రూ.24 కోట్లు (రూ.14కోట్లు, రూ.10కోట్లు) ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.అప్పుడు ఫ్రాంఛైజీల వద్ద రూ.66కోట్లు ఉంటాయి

– ఒక్కరిని మాత్రమే తీసుకోవాలనుకుంటే.మొత్తంగా రూ.14కోట్లు.అన్ క్యాప్‌డ్ ప్లేయర్ రూ.4కోట్లు చెల్లించిన సరిపోతుంది.ఒక రిటెన్షన్ తరువాత రూ.76కోట్లు ఫ్రాంఛైజీల వద్ద మిగిలి ఉంటాయి.

– ఎలాంటి రిటెన్షన్ చేయని పక్షంలో ఫ్రాంఛైజీల వద్ద రూ.90 కోట్లు ఉంటాయి.

గతంలో రూ.85 కోట్లుగా పర్స్ వాల్యూ ఉండేది కానీ ఆ వ్యాల్యూని రూ.5 కోట్లు పెంచి రూ.90కోట్లకు చేసింది బీసీసీఐ.

#Budget #IPL Franchises #Budget

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube