చెరుకు పంటకు( Sugarcane crop ) మార్కెట్లో ఎప్పుడు డిమాండ్ ఉండడంతో రైతులు చెరుకు పంటను పండించడానికి అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు.కాకపోతే అనవసర రసాయన ఎరువులను( Chemical fertilizers ) అధికంగా ఉపయోగించి పెట్టుబడి వ్యయంని పెంచుకుంటున్నారు.
అలా కాకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగించి అధిక దిగుబడి సాధించవచ్చుని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.ఆ సేంద్రియ ఎరువులు ఏవో.వాటిని ఎంత మోతాదులో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం .చెరుకు పంటలో అధిక దిగుబడి సాధించాలంటే.సాగు పద్ధతులు, శీతోష్ణస్థితులు, సస్యరక్షణ, విత్తన రకం, సాగునీటి నాణ్యత, సాగు భూమి లో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

చెరుకు పంటను సాగు చేయాలనుకునే నేలలో ముందుగా సేంద్రీయ పదార్థాలు వేసి అభివృద్ధి పరిచి ఆ తర్వాత చెరుకు పంటను నాటుకోవాలి.నేలలో సారం లేకపోతే ఒకటన్ను వేరుశెనగ తొక్కల పొడిను లోతు దుక్కులు దున్నుకునే సమయంలో పొలంలో వేయాలి.చౌడు భూములలో సాగు చేస్తున్నట్లయితే, ముందుగా లవణాలను మురుగునీటి కాలువ ద్వారా తీసివేయాలి.
లవణపరిమితి ఒక సెంటీమీటర్ కు 2 మీలీ మోస్ కన్నా ఎక్కువ ఉండకూడదు.క్షార భూములలో జిప్సం వేసి నేలను అభివృద్ధి చేయాలి.వేడి నీళ్ల ద్వారా విత్తన శుద్ధిని చేస్తే ఆకుమాడు తెగుళ్లు, గుడ్డిదుబ్బ, కాటుక లాంటి రోగాలు రాకుండా పంటను సంరక్షించవచ్చు.

వేసవికాలంలో నేలను లోతు దుక్కులు దున్నుకొని ఇతర పంటల అవశేషాలను పొలంలో లేకుండా శుభ్రం చేయాలి.ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదంటే 5 టన్నులు బాగా ఆరిన పొడి ఫిల్టర్ మట్టి వేసి కలియదున్నాలి.వీటితోపాటు ఒక ఎకరాకు రెండు కిలోల అజటోబాక్టర్ లేదంటే 4 కిలోల అజోస్పైరిల్లంను( Azospirillum ) 500 కిలోల పశువుల ఎరువులు వేసి కలపాలి.
ఈ ఎరువును రెండు దాఫలుగా పంటకు అందించాలి.పంట నాటిన మూడవరోజు సగభాగం, నాటిన 45 రోజుల తర్వాత మిగిలిన సగభాగం పంటకు అందించాలి.పంట నాటిన ఆరు రోజులకు నాలుగు కిలోల ఫాస్ఫో బాక్టీరియా ముచ్చెలు పంటకు అందించిన తర్వాత నీటి తడి అందించాలి.ఇక నేలలోని తేమ శాతాన్ని బట్టి నీటిని అందిస్తూ కలుపు ను ఎప్పటికప్పుడు తీసేస్తే మంచి దిగుబడి పొందవచ్చు.