ముడతలు తొలగిపోవడానికి అద్భుతమైన ఇంటి చిట్కాలు

వయస్సు పెరిగే కొద్ది ముఖం మీద ముడతలు రావటం అనేది సహజమే.ఈ ముడతలు అనేవి ముఖం,నుదురు,నోటికి ఇరువైపుల వస్తూ ఉంటాయి.

 What Are The Home Remedies To Reduce Wrinkles Details, Wrinkles, How To Reduce-TeluguStop.com

మొదట సన్నని ముడతలుగా ప్రారంభం అయ్యి క్రమేణా పెద్దగా పెరిగిపోతాయి.అయితే ముడతలను ఇంటిలో మనకు అందుబాటులో ఉండే వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

గుడ్డు

గుడ్డులోని తెల్లసొనను ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

గ్లిజరిన్

ఒక స్పూన్ రోజ్ వాటర్ లో ఒక స్పూన్ గ్లిజరిన్, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి రాయాలి.అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరి నూనె

కొంచెం కొబ్బరి నూనెను ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.ఈ విధంగా చేయటం వలన ముఖంలో రక్తప్రసరణ పెరిగి ముడతలు తొలగి తాజాగా, కాంతివంతంగా మారుతుంది.

Telugu Banana, Coconut Oil, Curd, Glycerine, Reduce Wrinkles, Skin Care, Telugu

అరటి పండు

బాగా పండిన ఒక అరటి పండును  గుజ్జులా చేసి దానిలో ఒక స్పూన్ తేనే, ఒక స్పూన్ పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి.బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పెరుగు

రెండు స్పూన్ల పెరుగులో అర స్పూన్ తేనే, నిమ్మరసం, విటమిన్ E ఆయిల్ వేసి బాగా కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube