రోజుకో క్యారెట్ తింటే ఎన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా..?

క్యారెట్‌.దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.నిండుగా ఆరెంజ్ కలర్ లో నిగనిగలాడే క్యారెట్.కూరగాయలలో తియ్యటి కూరగాయ.అందుకే చాలా మంది దీన్ని ప‌చ్చిగా ఉన్న‌ప్పుడే తినేస్తుంటారు.ఈ క్రంచీ వెజిటేబుల్‌ను అనేక వంట ల్లో ఉప‌యోగిస్తారు.

 What Are The Health Benefits Of Carrot..??, Health Benefits, Carrot, Health Tips-TeluguStop.com

ఇది వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి ఇవ్వ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూర్చుతుంది.

అయితే కొంద‌రు మాత్రం క్యారెట్‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.

కాని, ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యాలు తెలుసుకుంటే.ఖ‌చ్చితంగా మీ డైట్‌లో క్యారెట్‌ను చేర్చుకుంటారు .క్యారెట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉండాయి.రోజుకో క్యారెట్ తింటే.

అందులో ఉండె విటమిన్ ఎ కంటి చూపు‌ను మెరుగుప‌రుస్తుంది.అలాగే క్యారెట్‌లో విటమిన్ సి కూడా మ‌న‌కు లభిస్తుంది.

ఇది కణాల ఆరోగ్యానికి, దంతాలు, చిగుళ్ల సంరక్షణకు స‌హాయ‌పడుతుంది.

అలాగే క్యారెట్ లో ఉండే సోడియం ర‌క్త‌పోటును కంట్రోల్ చేస్తుంది.అందుకే ఆరోగ్య నిపుణులు రోజుకో క్యారెట్ తీసుకోమని చెబుతున్నారు.అంతేకాకుండా, క్యారెట్‌ను మ‌న డైట్‌లో చేర్చుకోవ‌డం వలన లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు.

ఎంద‌కంటే.క్యారెట్‌లో ఫాల్కరినల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ క్యాన్సర్‌ పై పోరాడేందుకు ఎంతగానో స‌హాయ‌ప‌డుతుంది.

గుండె ఆరోగ్యానికి కూడా క్యారెట్ గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.గుండె జ‌బ్బులు రాకుండా ఉండాల‌న్నా, గుండె ఆరోగ్యంగా ఉండాల‌న్నా.ఖ‌చ్చితంగా రోజుకో క్యారెట్ తీసుకోవాల్సిందే.మ‌రియు శ‌రీరంలో రోగ నిరోధక శక్తి పెంచ‌డంలోనూ క్యారెట్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అదే స‌మ‌యంలో రక్తహీనతకు కూడా క్యారెట్‌ దివ్య ఔషధంగా పనిచేస్తుంది.కాబ‌ట్టి, ప్ర‌తి రోజు ఒక క్యారెట్ తీసుకోమంటున్నారు నిపుణులు.

What Are The Health Benefits Of Carrot??, Health Benefits, Carrot, Health Tips, Health, Rating Carrot, Heart Attack, Cancer, Immunity Power, Latest News - Telugu Cancer, Carrot, Benefits, Tips, Heart Attack, Immunity, Latest

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube