వారెవ్వా.. క్యాప్సిక‌మ్‌తో ఇన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా?  

క్యాప్సిక‌మ్.మార్కెట్‌లో విరివిరిగా ల‌భించే కూర‌గాయ‌ల్లో ఇవి కూడా ఒక‌టి.వీటినే బెంగుళూరు మిర్చి అని కూడా అంటున్నారు.అయితే ఇవి పచ్చిమిర్చిలా ఘాటుగా కాకుండా.తక్కువ కారంతో, ఎక్కువ పోష‌కాలు నిండి రుచిగా ఉంటాయి.ర‌క‌ర‌కాల రంగుల్లో దొరికే క్యాప్సికమ్ ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారించ‌గ‌లదు.

TeluguStop.com - What Are The Health Benefits Of Capsicam

ఎ, సి మ‌రియు ఇ విట‌మిన్లు పుష్క‌లంగా ఉండే క్యాప్సిక‌మ్ తిన‌డం వ‌ల్ల శ‌రీర రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తుంది.కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది.రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది.అలాగే క్యాప్సిక‌మ్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ప్రొస్టేట్, గర్భాశయ, బ్లాడర్, క్లోమ గ్రంథి వంటి భ‌యంక‌ర క్యాన్సర్ల‌ను నివారిస్తాయి.

బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి క్యాప్సిక‌మ్ సూప‌ర్ ఫుడ్ అని చెప్పుకోవాలి.క్యాప్సిక‌మ్‌ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే.శ‌రీరంలో ఉన్న అద‌న‌పు కొలెస్ట్రాల్ క‌రిగించి బ‌రువు త‌గ్గేలా చేస్తుంది.అదే స‌మ‌యంలో గుండె ఆరోగ్యానికి మెరుగుప‌రుస్తుంది.

TeluguStop.com - వారెవ్వా.. క్యాప్సిక‌మ్‌తో ఇన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నాశ‌నం చేసే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా క్యాప్సిక‌మ్‌లో ఉన్నాయి.

మ‌ధుమేహం రోగులు క్యాప్సిక‌మ్ తీసుకోవ‌డం వ‌ల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.

ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డేవారు కూడా క్యాప్సిక‌మ్ తీసుకుంటే.చాలా మంచిద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

#Weight Loss #Immunity Power #Health Tips #Heart Problems #HealthBenefits

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు