ఏపీలో ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులు ఎన్నంటే.. ?

గత కొన్ని నెలల నుండి కరోనా అంటే తెలియనట్లుగా ప్రజలు ప్రవర్తిస్తున్నారన్న విషయం సృష్టంగా అర్ధం అవుతుంది.ముఖ్యంగా కోవిడ్ నియమాలు పాటించకుండా వ్యవహరిస్తున్న జనాన్ని చూసి కరోనాకు ముచ్చటేసినట్టుగా ఉంది కావచ్చూ.

 What Are The Corona Positive Cases In Ap-TeluguStop.com

అందుకే మరొక్క సారి తన ప్రతాపాన్ని చూపించడానికి సిఉద్దం అయ్యింది.

ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు ఊహించని రీతిలో నమోదు అవుతుండగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మరోసారి ప్రజలను హెచ్చరిస్తున్నాయి.

ఇకపోతే ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది.ఆ వివరాల ప్రకారం.

ఏపీలో గడిచిన 24 గంటల్లో 25,907 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా, వారిలో 74 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వెల్లడిస్తుంది.ఇక కర్నూలు జిల్లాలో అత్యధికంగా 13 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఇదే సమయంలో అనంతపురం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పేర్కొంది.

కాగా గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చెప్పున కోవిడ్ వల్ల మరణించారని వెల్లడించింది.ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 1,009 కరోనా యాక్టివ్ కేసులుండగా, 61 మంది కరోనా నుంచి కోలుకున్నారని అధికారులు తెలియ చేస్తున్నారు.

#Andhra Pradesh #Corona #Positive Cases #Today #COvid

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు