దీపంలోని రంగులైన్ని? అవి వేటికి సంకేతాలు?

దీపాన్ని తీక్షణంగా చూస్తే అందులో ఉండే మూడు రంగులూ మనకు కనిపిస్తాయి.తెలుపు, నీలం, ఎరుపు రంగులు వీటితో పాటు పసుపు రంగు కూడా కనిపిస్తుంటుంది.

 What Are The Colors Of The Deepam And What Are The Signs, Deepam , Colours , Lak-TeluguStop.com

కానీ తెలుపు, నీలం, ఎరుపు రంగల కలయికే… పసుపు రంగుగా మారి మనకు వెలుగునిస్తుంటుంది.తెలుపు రంగు సరస్వతీ దేవికి, ఎరుపు రంగు దుర్గా దేవికి, నీలం రంగు లక్ష్మీ దేవికి ప్రతీకలుగా చెబుతుంటారు.

ఈ మూడు రంగులు త్రిమాతల కలయికను సూచిస్తుంది.ఈ ముగ్గురు అమ్మల ఐక్య రూపమే త్రిగుణాల సంయగ్రూపం అంట.అవి సత్త్వ, రజ, స్తమో గుణాలను సూచిస్తాయంట.అందుకే నిత్యం దీపారాధన చేయమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

నిజానికి దీపం అంటే.నూనె పోసి వత్తి వెలిగించడం కాదు.మన మనస్సునే ప్రమిదగా చేసి భక్తిని నూనెగా చేసి, ఆత్మని వత్తిగా తీర్చి జ్ఞానాన్ని వెలిగించాలి.అప్పుడే మనం చేసిన దీపారాధనను త్రిమాతలు మెచ్చుతారు.

మనకు మంచి జరిగేలా చేస్తారు.ఇదే నిజమైన దీపారాధన అని పురాణాలు చెబుతున్నాయి.

ఇక దీపారాధన చేసేటప్పుడు ఈ శ్లోకం చదివితే మరింత మంచిదని వివరిస్తున్నారు.ఉదయం లేదా సాయంత్రం దీపారాధన సమయంలో ఈ శ్లోకాన్ని చదివితే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరి మనో వికాసం సిద్ధిస్తుందట.

 ఈ విషయాన్ని మర్చి పోకుండా ప్రతి రోజూ పాటించి అష్ట ఐశ్వర్యాలను పొందండని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

దీపం జ్యోతిః పరబ్రహ్మ

దీపం సర్వతమోపహమ్

దీపేన సాధ్యతే సర్వం

సంధ్యా దీపాన్నమోస్తుతే

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube