ఎడమ చేయి నొప్పి గుండె జ‌బ్బుల‌కే కాదు..వాటికీ సంకేత‌మే!

సాధార‌ణంగా గుండె పోటు వ‌చ్చే ముందు ఎడ‌మ చేయి తీవ్రంగా నొప్పి పుడుతుంటుంది.హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు అత్య‌ధికంగా క‌నిపించే ల‌క్ష‌ణాల్లో ఇదీ ఒక‌టి.

 What Are The Causes Of Left Hand Pain! Left Hand Pain, Causes Of Left Hand Pain,-TeluguStop.com

అలా అని ఎడ‌మ చేయి నొప్పి వ‌చ్చినంత మాత్రాన ఖ‌చ్చితంగా గుండె పోటు వ‌స్తుంద‌నీ కాదు.ఇత‌రిత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా ఎడ‌మ చేయి నొప్పి ప‌డుతూ ఉంటుంది.

మ‌రి ఏ మాత్రం టైమ్ వేస్ట్ చేయ‌కుండా ఎడ‌మ చేయి నొప్పి పుట్ట‌డానికి కార‌ణాలు ఏంటీ.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

కంప్యూట‌ర్ల ముందు గంట‌లు త‌ర‌బ‌డి ప‌ని చేసే వారు స‌రైన భంగిమ‌లో కూర్చోకుంటే.వారిలో ఎడ‌మ చేయి నొప్పి ఎక్కువ‌గా ఉంటుంది.అందు వ‌ల్ల‌, కూర్చునే పొజీష‌న్ క‌రెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి.మ‌రియు వ‌ర్క్ చేసేటప్పుడు మ‌ధ్య మ‌ధ్య‌లో బ్రేక్ తీసుకోండి.

త‌ద్వారా ఒత్తిడి పెర‌గ కుండా ఉంటుంది.

Telugu Hand Pain, Tips, Heart Attack, Heart Problems, Latest-Telugu Health - త

శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జ‌ర‌గ‌క‌పోవ‌డానికీ ఎడ‌మ చేయి నొప్పి ఒక సంకేతంగా చెప్పుకోవ‌చ్చు.ర‌క్త ప్రసరణ పెర‌గాలంటే వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోవాలి.ప్ర‌తి రోజూ చిన్న చిన్న‌ వ్యాయామాలు చేయాలి.

టీ, కాఫీలు తాగ‌డం త‌గ్గించాలి.ఉప్పు చాలా ప‌రిమితంగా త‌సుకోవాలి.

మ‌ద్య‌పానం అల‌వాటును మానుకోవాలి.పోష‌కాహారం తీసుకోవాలి.

రెగ్యుల‌ర్‌గా ఒక క‌ప్పు గ్రీన్ టీని తీసుకోవాలి.త‌ద్వారా ర‌క్త ప్ర‌స‌ర‌ణ పెరిగి.

ఎడ‌మ నొప్పి ద‌రి చేర‌కుండా ఉంటుంది.

Telugu Hand Pain, Tips, Heart Attack, Heart Problems, Latest-Telugu Health - త

అలాగే నిద్రించే భంగిమ సరిగ్గా లేకయినా ఎడ‌మ చేయి నొప్పి పుడుతుంది.గ్యాస్‌, అసిడిటీ వంటి సమస్య వల్ల కూడా ఎడ‌మ చేయి నొప్పి వ‌స్తుంది.అంతేకాదు, క్యాన్సర్ బాధితుల్లో కూడా ఎడమ చేయి నొప్పి ఉంటుంది.

వీరిలో కీమో థెరపీ మందులు మ‌రియు ఇత‌రిత‌ర కార‌ణాల వ‌ల్ల ఎడ‌మ చేయి త‌ర‌చూ నొప్పి ప‌డుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube