నవజాత శిశువుకు కరోనా సోకడానికి కారణాలివే..?  

causes for corona infected to new born babies, New born baby, during delivery, pregnant woman, corona virus, newborn babies,less symptoms - Telugu Causes For Corona Infected To New Born Babies, Corona Virus, During Delivery, Less Symptoms, New Born Baby, Newborn Babies, Pregnant Woman

కరోనా మహమ్మారి వయసుతో తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పై విరుచుకుపడుతుంది.ఈ నేపథ్యంలోనే ఈ వ్యాధి ప్రభావం చిన్నపిల్లలు, ముసలివారి పై అధిక ప్రభావం చూపడంతో, కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తుంది .

TeluguStop.com - What Are The Causes Of Corona Infection In A Newborn Baby

కరోనా మరణాలలో దాదాపు 50 శాతం మంది 60 సంవత్సరాలు పైబడిన వారుగా గుర్తించారు.నవజాత శిశువుల్లో కూడా కరోనా సోకడం మనం గమనించే ఉంటాం.

అయితే నవజాత శిశువుల్లో కరోనా రావడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఫ్రాన్స్ లో నిర్వహించిన ఓ అధ్యయనంలో,కొన్ని ఆశక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

TeluguStop.com - నవజాత శిశువుకు కరోనా సోకడానికి కారణాలివే..-General-Telugu-Telugu Tollywood Photo Image

సాధారణంగా మనం నవజాత శిశువుల్లో కరోనా రావడానికి గల కారణం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లికి కరోనా సోకడంతో వ్యాధి బిడ్డకు వ్యాప్తి చెందుతుందని భావించారు.

అయితే కేవలం 30 % మందికి మాత్రమేతల్లి గర్భంలో ఉన్నప్పుడు లేక ప్రసవ సమయంలో బిడ్డకు కరోనా వైరస్ బారిన పడుతుందని ఈ అధ్యయనంలో తేలింది.

ఈ అధ్యయనంలో భాగంగా176 నవజాత శిశువులను పరిశీలించగా వారిలో చాలా అరుదుగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు వైరస్ సోకింది అని తేలింది.

అయితే ప్రసవ సమయంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య అధికంగా ఉందని ఈ పరిశోధనలో తేలింది.అయితే ఈ శిశువులలో కేవలం కరోనా స్వల్ప లక్షణాలతో మాత్రమే వ్యాపించిందని, మిగిలిన ఇతర కారణాల వల్ల ముగ్గురు పిల్లలు మరణించినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు.

మిగిలిన 70 శాతం మంది పిల్లలు ప్రసవం తర్వాత ఆస్పత్రి సిబ్బంది ద్వారా, వారి కుటుంబ సభ్యుల ద్వారా, లేదా విజిటర్స్ ద్వారా మాత్రమే కరోనా బారిన పడుతున్నారని ఈ పరిశోధనలో తేలింది.అంతేకానీ తల్లి నుంచి బిడ్డకు వ్యాధి వ్యాప్తి చెందడం చాలా అరుదైన విషయమని డాక్టర్లు తెలిపారు.

వాక్సిన్ కనుగొనే వరకు వీలైనంత వరకు గర్భిణీ మహిళలు తగు జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరమని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

#CausesFor #Pregnant Woman #Newborn Babies #New Born Baby #Less Symptoms

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

What Are The Causes Of Corona Infection In A Newborn Baby Related Telugu News,Photos/Pics,Images..