నిపుణుల మాట : పిల్లలు పుట్టక పోవడంకు ప్రధానమైన 10 కారణాలు

ఈమద్య కాలంలో ప్రపంచమంతా కూడా దంపతులు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెళ్లడించిన వివరాల ప్రకారం పెళ్లి అయ్యి అయిదు సంవత్సరాలు దాటినా కూడా ఇంకా పిల్లలు కలగని 25 కోట్ల జంటలు ఉన్నాయనే షాకింగ్‌ విషయాన్ని వెళ్లడించడం జరిగింది.

 What Are The Causes For Man And Woman Infertility-TeluguStop.com

వీరిలో 10 శాతం మంది మాత్రం పిల్లలు వద్దనుకుంటున్నారు.మిగిలిన వారు పిల్లల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నా కూడా వారు విఫలం అవుతున్నట్లుగా సర్వేలో వెళ్లడయ్యింది.

అయితే పిల్లలు కలుగక పోవడంకు జన్యు సమస్యలు కొన్ని అయితే కొన్ని మానవ తప్పిదాలు అంటూ సదరు సంస్థ తెలియజేసింది.

నిపుణుల మాట  పిల్లలు పుట్టక పో

పిల్లలు పుట్టక పోవడంకు ప్రధానంగా 10 కారణాలు అయ్యి ఉండవచ్చు అంటూ వారు చెబుతున్నారు.ఇంకా ఎక్కువగానే ఉంటాయి కాని ఎక్కువ శాతం ఈ సమస్యల కారణంగానే పిల్లలను పొందలేక పోతున్నారట.దంపతుల మద్య సరైన శారీరక సంబంధం లేకపోవడం ప్రధాన కారణం.

శృంగార సమయంలో పూర్తి స్వేచ్చగా ఉంటేనే పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుందట.పిల్లలు పుట్టని జంటల్లో ఎక్కువ శాతం మగవారిలో సెర్మ్‌ కౌంట్‌ తక్కుగా ఉండటంను వారు గమనించారట.

కౌంట్‌ తక్కువ ఉండటానికి ప్రధాన కారణం చేసే పని, తినే ఆహారం.ఎక్కువ గంటలు కంప్యూటర్‌ వద్ద కూర్చోవడం లేదంటే ల్యాప్‌ టాప్‌ను తొడలపై పెట్టుకోవడం వంటివి చేస్తే కౌంట్‌ తక్కుతుంది.

మెల్ల మెల్లగా మిలియన్స్‌లో ఉండాల్సిన కౌంట్‌ కనీసం వేలల్లో కూడా ఉండదు.జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తినడం వల్ల కూడా కౌంట్‌ తగ్గే అవకాశం ఉంది.

నిపుణుల మాట  పిల్లలు పుట్టక పో

ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగా లేకుంటే అండాల ఉత్పత్తి సరిగా అవ్వదు.బలహీనంగా ఉండటం, రక్తం తక్కువగా ఉండటం వంటి కారణాలతో పిల్లల పుట్టక పోవచ్చు.ఆడవారిలో థైరాయిడ్‌ సమస్య ఉన్నా కూడా పిల్లలకు ఇబ్బంది అవుతుందని నిపుణులు చెబుతున్నారు.మగవారిలో దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే పిల్లలు పుట్టక పోవచ్చు అంటున్నారు.ఇక కొందరు మగవారిలో సెర్మ్‌ బలహీనంగా ఉండటం వల్ల కూడా పిల్లలు కలగడం లేదు అంటూ నిపుణులు చెబుతున్నారు.చిన్న వయసులో వచ్చిన అనారోగ్య సమస్యలు, వాటి కోసం తీసుకున్న చికిత్సల కారణంగా కూడా పిల్లలు పుట్టకుండా ఉండే అవకాశం ఉందట.

ఆడవారిలో గర్బసంచి సమస్యలు ఉండటం వల్ల కూడా పిల్లలు పుట్టడం లేదట.బలహీనంగా ఉండే ఆడవారు ఒకవేళ గర్భం దాల్చినా కూడా అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube