వారానికోసారి పెడిక్యూర్ చేసుకుంటే..మ‌స్తు బెనిఫిట్స్‌!

పాదాలు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే పెడిక్యూర్ ఎంతో అవ‌స‌రం.అందుకే కొంద‌రు త‌ర‌చూ బ్యూటీపార్ల‌ర్స్‌కు వెళ్లి పెడిక్యూర్ చేయించుకుంటారు.

 What Are The Benefits Of Pedicure-TeluguStop.com

అయితే ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో బ్యూటీపార్ల‌ర్స్‌కు వెళ్లే ప‌రిస్థితి లేదు.అందువ‌ల్ల‌, ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవ‌డం అల‌వాటు చేసుకోవాలి.

మ‌రి ఇంట్లోనే సులువ‌గా పెడిక్యూర్ ఎలా చేసుకోవాలి ? అస‌లు పెడిక్యూర్ వ‌ల్ల వ‌చ్చే బెనిఫిట్స్ ఏంటీ ? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 What Are The Benefits Of Pedicure-వారానికోసారి పెడిక్యూర్ చేసుకుంటే..మ‌స్తు బెనిఫిట్స్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెడిక్యూర్ చేసుకోవ‌డానికి ముందుగా కాలి గోళ్లపై ఉన్న నెయిన్ పాలిష్‌ను రిమూవ‌ర్‌తో తొలిగించాలి.

ఆ త‌ర్వాత గోళ్ల‌ను స‌మానంగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక ట‌బ్‌లో గోరు వెచ్చ‌ని నీళ్లు పోసి అందులో నిమ్మ ర‌సం, ఉప్పు, కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూ, కావాలనుకుంటే ఆరెంజ్ ఎసెన్స్ వేసి మిక్స్ చేసి పాదాల‌ను ట‌బ్‌లో ఇర‌వై నిమిషాల పాటు ఉంచాలి.

అనంత‌రం పాదాల‌ను ప్యుమిస్ స్టోన్‌తో కానీ, ఫుట్ స్క్రబ్బర్ కానీ, ఏదైనా గ‌ర‌క‌గా ఉండే పిండితో కానీ పాదాల‌ను స్క్ర‌బ్ చేయాలి.

అనంత‌రం పాదాల‌ను శుభ్ర‌మైన నీటిలో క‌డిగి.ట‌వ‌ల్‌తో త‌డి లేకుండా తుడుచుకోవాలి.ఇప్పుడు మర్దనా ఆయిల్‌ లేదా మాయిశ్చరైజర్‌ను పాదాల‌కు అప్లై చేసి కాసేపు మ‌సాజ్ చేసుకుంటే స‌రిపోతుంది.

ఇలా వారానికి ఒక సారి పెడిక్యూల్ చేసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.చాలా మంది పాదాల ప‌గుళ్ల‌తో బాధ ప‌డ‌తారు.కానీ, పెడిక్యూర్ చేసుకుంటే ఈ స‌మ‌స్య‌కు దూరంగా ఉండొచ్చు.

అలాగే పెడిక్యూర్ వ‌ల్ల పాదాల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

దాంతో ఎటువంటి నొప్పులు, ఆర్థరైటీస్, వెరికోస్‌ వెయిన్స్‌ వంటివి తలెత్త‌కుండా ఉంటాయి.పెడిక్యూర్ చేసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్, చిరాకు వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

మ‌న‌సు ప్ర‌శాంతంగా మారుతుంది.ఇక పెడిక్యూర్ వ‌ల్ల టెన్షన్ పూర్తిగా పోతుంది.

దాంతో కోపం, కన్‌ఫ్యూజన్ త‌గ్గి.మైండ్ ఉత్సాహంగా, వేగంగా ప‌ని చేస్తుంది.

#Pedicure Tips #Pedicure #Care #Pedicure #Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube