బచ్చలి కూర తింటే ఎన్ని లాభాలు అంటే..!

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్క మనిషి ఆహార పద్ధతుల్లో కాస్తో కూస్తో మార్పులు చేర్పులు జరిగాయి.ఇది వరకూ ఏదో ఒక ఆహార పదార్థం తీసుకుంటే చాలు బ్రతికేయొచ్చు అన్న ఆలోచన నుంచి శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవాలన్న ఆలోచనకు వచ్చారు చాలా మంది.

 Wonderful Health Benefits Of Malabar Spinach,health Tips, Health Care, Leafy Ve-TeluguStop.com

ఇందులో భాగం గానే వైద్యులు ఎప్పడి నుంచో శరీరానికి ఆకు కూరలు రెగ్యులర్ గా తినాలని సూచిస్తూ ఉంటారు.వాటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందు తామని వైద్యులు సలహా ఇస్తున్నారు.

ఇక ఆకు కూరలలో మనకు తరచుగా లభించే ఆకు కూర బచ్చలి కూర.దీనినే వైద్యులు సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు.

ఆకు కూరలలో శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలు, విటమిన్లు బాగా లభిస్తాయి.అయితే వీటిని తరచుగా తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయో ఓసారి చూద్దామా…

ఈ మధ్య కాలంలో చాలా మంది కంటి ఆరోగ్యానికి లోనవ్వడం చూస్తూనే ఉన్నాం.

బచ్చలి కూరలో ఉండే విటమిన్ల కారణంగా కంటికి అతి నీల లోహిత కాంతి నుంచి పాడవకుండా వాటిని కాపాడుతాయి.కంటికి వచ్చే దీర్ఘకాలిక సమస్యల నుండి బచ్చలకూర కాపాడ గలదు.

అలాగే బచ్చలకూరలో ఇద్దరికీ విటమిన్ ఏ, అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు కెరోటిన్ లాంటి వాటి వలన మన మెదడు పని తీరు బాగా పెరుగుతుంది.దీని ద్వారా మనం ఎప్పుడూ చురుకుగా ఉండేందుకు ఉపకరిస్తుంది.

వీటితో పాటు బచ్చలి కూర లో ఉండే నైట్రెట్లు శరీరంలోని రక్త ప్రవాహాన్ని మెరుగు పరి చేందుకు దోహదం చేస్తాయి.అంతే కాకుండా వీటిని తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన కొన్ని రకాల వ్యాధులను రాకుండా చూసుకోవచ్చు.గుండెకు సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొనేందుకు ఉపయోగించే ఆహారం బచ్చలి కూర కూడా ఒకటి.వీటితోపాటు బచ్చలికూర లో ఎక్కువ మోతాదులో ఐరన్ ఉండటం వల్ల దాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో ఎర్రరక్తకణాల సంఖ్య పెరిగి రక్తహీనత లోపం రాకుండా ఉండేందుకు దోహదం చేస్తుంది.

ముఖ్యంగా మహిళలు ఎవరైనా రక్త హీనత సమస్య ఎదుర్కొంటున్న వారు బచ్చలి కూరను తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.కాబట్టి మీ ఆహారంలో వారానికి ఒకటి లేదా రెండు సార్లు బచ్చలి కూర చేర్చుకోవడం ద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube