స్త్రీల‌లో గుండె పోటు రావ‌డానికి ప్రధాన కార‌ణాలేంటో తెలుసా?

What Are Main Causes Of Heart Attack In Women

ప్ర‌తి సంవ‌త్స‌రం గుండె పోటుతో మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య క్ర‌మ క్ర‌మంగా పెరిగి పోతోంది.ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న‌శైలి, శారీరక శ్రమ లేక పోవడం ఇలా ర‌క‌ర‌కాల అంశాలు గుండెను ప్ర‌భావితం చేస్తుండ‌డంతో.

 What Are Main Causes Of Heart Attack In Women-TeluguStop.com

కోట్లాది మంది గుండె పోటుతో మృత్యువాత ప‌డుతున్నారు.ఇక నిన్న మొన్న‌టి వ‌ర‌కూ పురుషులే ఎక్కువ‌గా గుండె పోటుకు గుర‌వుతార‌ని, స్త్రీల‌లో ఆ ముప్పు చాలా త‌క్కువ‌ని న‌మ్ముతుండేవారు.

కానీ, ప్ర‌స్తుత రోజుల్లో అది కేవ‌లం అపోహే అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు.

 What Are Main Causes Of Heart Attack In Women-స్త్రీల‌లో గుండె పోటు రావ‌డానికి ప్రధాన కార‌ణాలేంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే, ఆ విష‌యంలో స్త్రీలు కూడా పురుషుల‌తో పోటీ ప‌డుతున్నారు.

అయితే అస‌లు స్త్రీల‌లో గుండె పోటు రావ‌డానికి ప్రాధాణ కార‌ణాలు ఏంటీ.? గుండె పోటు రావ‌డానికి ముందు వారిలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి…? వంటి విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.అధిక ఒత్తిడి మ‌ధుమేహం, హై కొలెస్ట్రాల్‌, స‌మయం మొత్తం కుటుంబానికే అంకితం ఇస్తూ స‌రిగ్గా ఆహారం తీసుకోక పోవడం, హై బీపీ, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం, మెనోపాజ్‌, ఓవ‌ర్ వెయిట్‌ వంటివి స్త్రీల‌లో గుండె పోటు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్పుకోవ‌చ్చు.

గుండె పోటు ల‌క్ష‌ణాల విష‌యానికి వ‌స్తే.స్త్రీ, పురుషుల్లో చాలా భిన్నంగా ఉంటాయి.మ‌గవారిలో గుండె పోటు సమయంలో ఛాతి లో పట్టేసి నట్టు, ఉండ‌టం, ఎడమ చేయి లాగ‌డం, వెన్ను నొప్పి తరహా లక్షణాలు కనిపిస్తేస్త్రీల‌లో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు, దవడ నొప్పి, పొత్తి క‌డుపు నొప్పి వంటి క‌నిపిస్తాయి.

ఇక గుండె పోటుకు దూరంగా ఉండాలీ అనుకునే స్త్రీలు.స‌రైన టైమ్‌కు స‌రైన ఆహారం తీసుకోవాలి.రోజూ ఏడు నుంచి ఎనిమిది గంట‌లు నిద్ర పోవాలి.ప్ర‌తి రోజు క‌నీసం అర గంటైనా వ్యాయామాలు చేయాలి.చెడు అల‌వాట్ల‌కు దూరంగా ఉండాలి.ఒత్తిడిని, బ‌రువును అదుపులో ఉంచుకోవాలి.

పెయిన్ కిల్ల‌ర్స్ వేసుకోవ‌డం పూర్తిగా త‌గ్గించాలి.ఫాస్ట్ ఫుడ్స్‌, ఆయిలీ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్‌ను తీసుకోవ‌డం నివారించాలి.

త‌ద్వారా మీ గుండె ప‌దిలం ఉంటుంది.

#Tips #Heart Attack #Heart Attack #Healthy Heart

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube