నష్టపోయిన అల్లరి నరేష్

సినిమా అనేది మాయ ప్రపంచం.ఎప్పుడు ఎవరి దశ ఎటు తిరుగుతుందో చెప్పలేం.

 What Allari Naresh Had Lost ?-TeluguStop.com

ఒకరు చేయాల్సిన సినిమా ఇంకొకరికి వెళ్ళిపోతుంది … ఒకరు అనుభవించాల్సిన స్టార్ స్టేటస్ ఇంకొకరు అనుభవిస్తారు.ఖైది అనే సినిమా ముందుగా అనుకున్నట్టు సూపర్ స్టార్ కృష్ణ చేసుంటే ? మనం మెగాస్టార్ ని చుసేవారిమో కాదో.అతడు సినిమా పవన్ కళ్యాణ్ ఒప్పుకునుంటే ? బహుషా మహేష్ ని విపరీతంగా ఆరాధించే ఫ్యామిలి ఆడియెన్స్ పవన్ వైపు మొగ్గు చుపేవారేమో.

ఇలాంటి దురదృష్టం అల్లరి నరేష్ ని కుడా వదల్లేదు.

వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న నాని కెరీర్ ని ఎక్కడికో తీసుకెళ్ళిన సినిమా భలే భలే మొగాడివోయ్ .కాని ఈ సినిమా నాని చేయాల్సింది కాదట .ఈ స్క్రిప్ట్ నాని కన్నా ముందే అల్లరి నరేష్ విన్నాడట.కాని బూతు డైరెక్టర్ అనే బ్రాండ్ ఉన్న మారుతితో పని చేయాడానికి ఇష్టపడని నరేష్ సినిమా చేసేందుకు సాహసించలేదు.

కాలం గడిచింది, మారుతి రేంజ్ పెరిగింది, కథ నాని కి వెళ్ళింది.నాని ఒప్పుకున్నాడు, కట్ చేస్తే సినిమా చాలా పెద్ద హిట్, పంపిణిదారులకు కొన్నదానికి రెండింతలు లాభాలు తెచ్చిపెడుతోంది.నాని ఒక్కసారిగా చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు.20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసే దిశగా సాగుతున్న భలే భలే మొగాడివోయ్, నాని గోపీచంద్,నితిన్ లాంటి హీరోలను ఛాలెంజ్ చేసే రేంజ్ కి తీసుకెళ్ళింది.పాపం అల్లరి నరేష్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube