మన ‘టెంపర్‌’ పరిస్థితి అక్కడ ఏంటీ?

ఎన్టీఆర్‌, పూరిల కాంబినేషన్‌లో తెరకెక్కి సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఎన్టీఆర్‌ కెరీర్‌ లోనే దిబెస్ట్‌ నటన ఆ చిత్రంలో చూపించాడు అంటూ చెప్పుకునే ‘టెంపర్‌’ చిత్రం తమిళం మరియు హిందీలో రీమేక్‌ అవుతున్న విషయం తెల్సిందే.తమిళ ‘టెంపర్‌’ ఇంకా పూర్తి కాలేదు.

 What About Temper Remake In Bollywood-TeluguStop.com

కాని హిందీ టెంపర్‌ మాత్రం తాజాగా సింబాగా రిలీజ్‌ అయ్యింది.క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సింబా యావరేజ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

‘టెంపర్‌’ స్థాయిలో సినిమా లేదనే టాక్‌ వస్తుంది.తెలుగు టెంపర్‌ చూసిన వారు హిందీ సింబా పూర్తి స్థాయిలో సంతృప్తి పర్చలేక పోతుంది.అయితే టెంపర్‌ తో సంబంధం లేకుండా సింబా చూస్తే మాత్రం పర్వాలేదు అన్నట్లుగా ఉందట.మొదటి రోజు మంచి వసూళ్లను దక్కించుకున్న ‘సింబా’ సినిమా ఆ తర్వాత కూడా పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లను రాబడుతోంది.

వంద కోట్ల క్లబ్‌ లో చేరడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

టెంపర్‌ రీమేక్‌లో ఎన్టీఆర్‌ పాత్రను రన్‌వీర్‌ సింగ్‌ పోషించగా, కాజల్‌ పాత్రను మాత్రం సారా అలీఖాన్‌ పోషించింది.టెంపర్‌లో మాదిరిగానే సారా అలీ ఖాన్‌ పాత్ర సో సో గానే ఉంది.పెద్దగా ఆమెకు ప్రాముఖ్యత దక్కలేదు.

రన్‌వీర్‌ సింగ్‌కు ఆమెకు జోడీ అంతగా కలిసినట్లుగా అనిపించలేదు.మొత్తానికి హిందీ ‘సింబా’గా చూస్తే మాత్రం ఓకే, కాని టెంపర్‌ రీమేక్‌ గా తీసుకుంటే మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

రన్‌వీర్‌ సింగ్‌ నటన ఎన్టీఆర్‌ స్థాయిలో లేదనే టాక్‌ కూడా ఉంది.మొత్తానికి టెంపర్‌ రీమేక్‌ సో సో గా సాగేసిందన్నమాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube