'గ్యాంగ్‌ లీడర్‌' కలెక్షన్స్‌ పరిస్థితి ఏంటీ?  

What About Nani Gang Leader Collections-nani Gang Leader,vikram K Kumar Director

నాని హీరోగా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.జెర్సీ వంటి సూపర్‌ హిట్‌ చిత్రం తర్వాత నాని నటించిన చిత్రం అనగానే అంచనాలు భారీగా వచ్చాయి.అంచనాలకు తగ్గట్లుగానే దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని టీజర్‌ మరియు ట్రైలర్‌ చూసిన తర్వాత ప్రేక్షకులకు అనిపించింది.

What About Nani Gang Leader Collections-nani Gang Leader,vikram K Kumar Director-What About Nani Gang Leader Collections-Nani Vikram K Kumar Director

అందుకే సినిమా భారీ ఎత్తున విడుదలైంది.అన్ని చోట్ల కూడా ఎక్కువ థియేటర్లను దక్కించుకుంది.

What About Nani Gang Leader Collections-nani Gang Leader,vikram K Kumar Director-What About Nani Gang Leader Collections-Nani Vikram K Kumar Director

విడుదలకు ముందే ఈ చిత్రం దాదాపుగా 35 కోట్లను రాబట్టింది.పెట్టుబడిని విడుదలకు ముందే రాబట్టి నిర్మాతల నెత్తిన పాలు పోసిన గ్యాంగ్‌ లీడర్‌ ఇప్పుడు విడుదల తర్వాత బయ్యర్లకు కూడా సంతోషాన్ని కలిగిస్తున్నాడు.మొదటి రోజు ఓపెనింగ్స్‌ను చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపుగా 10 కోట్లను రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది.మొదటి వారంలోనే కొన్ని ఏరియాల్లో బ్రేక్‌ ఈవెన్‌ సాధించవచ్చు అంటూ టాక్‌ వస్తుంది.

రెండు వారాల పాటు బాక్సాఫీస్‌ వద్ద సందడి కొనసాగించిన సాహో చిత్రం జోరు తగ్గడంతో ఇప్పుడు గ్యాంగ్‌ లీడర్‌ ఆ స్థానంను భర్తీ చేశాడు.నిన్న విడుదలై మంచి వసూళ్లను రాబట్టిన గ్యాంగ్‌ లీడర్‌ నేడు రేపు శని ఆదివారాలు అవ్వడంతో మరింత భారీగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చిన కారణంగా నిర్మాతలు మరియు బయ్యర్లు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.

మినిమం గ్యారెంటీ హీరో ట్యాగ్‌ను నాని మరోసారి నిలబెట్టుకున్నాడు అంటూ టాక్‌ వస్తుంది.