డైరెక్టర్‌ శంకర్‌ కండీషన్‌ ఏంటీ?  

What About Director Shankar Situation - Telugu Indian 2, Indian2 Movie Set Accident, Lyka Production, Shankar, Shankar Accident, Tamil

ఇండియన్‌ 2 చిత్రం షూటింగ్‌లో గాయపడ్డ శంకర్‌ పరిస్థితి ఏంటి అంటూ నిన్నటి నుండి అభిమానులు మరియు మీడియా వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేశారు.కుటుంబ సభ్యులు మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ విషయాన్ని క్లారిటీ ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున శంకర్‌ ఆరోగ్య పరిస్థితి తొసుకునేందుకు ఆయన ఇంటి వద్దకు చేరుకోవడం, లైకా ప్రొడక్షన్‌ ఆఫీస్‌ వద్దకు చేరుకోవడం చేశారు.

What About Director Shankar Situation

ఎట్టకేలకు శంకర్‌ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ వచ్చింది.
శంకర్‌ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని, కాలుకు పాశ్చర్‌ అన్నారు.

అది కూడా ఏం లేదని ఈ సందర్బంగా తేలిపోయింది.హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ అయిన శంకర్‌ ఇంటికి చేరుకున్నారు.

ఆయనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.దాంతో శంకర్‌ ఆరోగ్య పరిస్థితిపై గత కొన్ని గంటలుగా వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చినట్లయ్యింది.

శంకర్‌ ఒక కాలు తీసేయాల్సి వచ్చిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అంటూ ఎవరికి తోచిన విధంగా వారు పుకార్లు పుట్టించే ప్రయత్నం చేశారు.దాంతో తాజాగా తమిళ మీడియా వారికి శంకర్‌ ప్రస్తుతం పరిస్థితి ఫొటోను పంపించడం జరిగింది.ఆ ఫొటోలో శంకర్‌ ఆరోగ్యంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు.ఆయనకు ఎలాంటి ప్రమాదం అయితే కాలేదు కాని తన వారిని కోల్పోయాను అనే బాధ మాత్రం ఆయనలో కనిపిస్తుంది.

తాజా వార్తలు

What About Director Shankar Situation-indian2 Movie Set Accident,lyka Production,shankar,shankar Accident,tamil Related....