మట్టిల్లో మాణిక్యం : కూలీ పని చేసుకునే ఈ వ్యక్తి మాటలు విన్న జర్నలిస్ట్‌కు మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది  

What A Labour From Bihar Said About Pm Narendra Modi In Noida-loksabha Of Uttar Pradesh,modi In Noida,what A Labour,కూలీ వ్యక్తి ఇంగ్లీష్‌లో సమాధానం,సోషల్‌ మీడియాలో వైరల్‌

  • ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి దశలోనే ఎన్నికలు పూర్తి అయ్యాయి, దాంతో తెలుగు రాష్ట్రాల్లో సందడి కాస్త తగ్గింది.

  • మట్టిల్లో మాణిక్యం : కూలీ పని చేసుకునే ఈ వ్యక్తి మాటలు విన్న జర్నలిస్ట్‌కు మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది-What A Labour From Bihar Said About PM Narendra Modi In Noida

  • అయితే ఇతర రాష్ట్రాల్లో మాత్రం పెద్ద మొత్తంలో ఎన్నికల సందడి కొనసాగుతుంది. ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీకి ఓటు వేస్తారు, మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు అంటూ మీడియా వారు సామాన్యుల వద్దకు వెళ్లి అడగడం మనం చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం.

  • కామన్‌ పీపుల్‌ మాట్లాడమంటే తమకు మంచి చేసిన నాయకుడు, ఇష్టమైన నాయకుడి గురించి రెండు మూడు ముక్కులు సిగ్గు పడుతూ మాట్లాడతాం. కాని బీహార్‌కు చెందిన ఒక కూలీ పని చేసే వ్యక్తి ఒక రాజకీయ విశ్లేషకుడి మాదిరిగా మాట్లాడి అందరు నోరు వెళ్లబెట్టేలా చేశాడు.

  • తాజాగా బీహార్‌కు చెందిన ఒక స్థానిక మీడియా సంస్థ గ్రౌండ్‌ లెవల్‌లో కేంద్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకునేందుకు రిపోర్టింగ్‌కు వెళ్లడం జరిగింది. సహజంగా అందరిని ప్రశ్నించిన మాదిరిగానే ఒక వ్యక్తిని జర్నలిస్ట్‌ ఎవరు అయితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు అంటూ ప్రశ్నించిన సమయంలో ఆ కూలీ పని చేసుకునే వ్యక్తి ఇంగ్లీష్‌లో మాట్లాడం మొదలు పెట్టాడు.

  • ఓ. మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారా, అంటే ఏం నాకు ఇంగ్లీష్‌ రాదు అనుకుంటున్నారా అంటూ దారాలంగా ఇంగ్లీష్‌ మాట్లాడాడు.

  • జర్నలిస్ట్‌ సైతం ఇంగ్లీష్‌లో మాట్లాడలేక హిందీలో ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు. ఆ కూలీ వ్యక్తి ఇంగ్లీష్‌లో సమాధానం చెప్పాడు. ఒక కూలీ అయ్యి ఉండి ఇంగ్లీష్‌లో ఇంత బాగా మాట్లాడటంతో ఆ జర్నలిస్ట్‌ అవాక్కయ్యాడు.

  • మీరు ఏం చదువుకున్నారు, ఉద్యోగంకు ప్రయత్నం చేయలేదా అంటూ ప్రశ్నించాడు. నేను ఉద్యోగంకు ప్రయత్నించలేదు.

  • నాకు ఈ కూలీ పని బాగుంది. ఇందిరా గాంధీ అంటే తనకు ఇష్టం అంటూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడాడు.

  • ఈ కూలీ వ్యక్తి ఇంగ్లీష్‌లో మాట్లాడటం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దేశ వ్యాప్తంగా ఇతడిని మట్టిలో మాణిక్యం అంటూ అభినందిస్తున్నారు.