చెట్టుపై ఎంత పెద్ద పాము.. చూస్తే వ‌ణుకు పుట్టాల్సిందే..!

చాలా సందర్భాల్లో అనుకోని సంఘటనల వలన మనం చాలా భయపడిపోతుంటాం.తర్వాత ఆ ఘటన గురించి ఆలోచిస్తే.

 What A Big Snake On The Tree .. If You Look, You Will Be Born With A Sore Throat-TeluguStop.com

మనం చేసిన పనికి నవ్వు వస్తూ.ఉంటుంది.

పాములు సాధారణంగా అనేక ప్రాంతాల్లో తిష్ట వేసుకుని తిరుగుతూ ఉంటాయి.అడవులు తగ్గిపోవడంతో ఈ మధ్య కాలంలో పాములు తరుచుగా జనావాసాల్లోకి కూడా వస్తున్నాయి.

ఇందులో ఏ మాత్రం వాటి తప్పు లేకపోయినా.సరే అనవసరంగా బలవుతుంటాయి.

కొంత మంది పాములను చూసి విపరీతంగా బయపడతారు.కొంత మంది పాములు మనుషులను పగబట్టి గుర్తుంచుకుని తర్వాత దాడి చేస్తాయని చెబుతారు.

అవన్నీ ఒట్టి మూఢనమ్మకాలే తప్ప అందులో ఎటువంటి శాస్త్రీయత లేదని అనేక మంది సైంటిస్టులు ప్రకటించారు.

కానీ కొంత మంది ఇప్పటికీ పాములు పగబడతాయనే విషయాన్ని విశ్వసిస్తూ ఉంటారు.

పాములు సడెన్ గా కనిపించే సరికి మనలో ఎవరైనా సరే దడుసుకుంటారు.అదే భారీ పాము ఉన్నట్టుండి కనిపిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.

బ్యాంకాక్ లో ఇలానే జరిగింది.సాధారణంగా మార్నింగ్ వాక్ చేస్తున్న జనాలకు పార్కులో దాదాపు 11 అడుగుల పైథాన్ కంట పడింది.

ఇది చూసిన వాళ్లు ఎంతలా దడుసుకుని ఉంటారో ఇట్టే ఊహించుకోవచ్చు.అసలేం జరిగిందంటే.

బ్యాంకాక్‌లోని బెంజసిరి పార్క్ సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తున్న కొంతమంది వ్యక్తులు చెట్టుపైన 11 అడుగుల భారీ పైథాన్ వేలాడుతూ ఉందని గమనించారు.అది చూసిన వారు ఆ పైథాన్ తమ మీద ఎక్కడ పడుతుందో అని చాలా భయపడిపోయారు.అలా చివరికి పోలీసులకు సమాచరం అందించారు.దీంతో పోలీసులు ఆ పైథాన్ ను పట్టుకునేందుకు అగ్ని మాపక సిబ్బందిని వెంట బెట్టుకుని రంగంలోకి దిగారు.అగ్ని మాపక సిబ్బంది రావడం మూలన పోలీసులకు ఆ పామును పట్టుకోవడం చాలా సులువైంది.అగ్ని మాపక సిబ్బంది చెట్టుకు ఎదురుగా ఉన్న భవనం ఎక్కి పామును చాకచక్యంగా పట్టుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube