మరో అద్భుత ఫీచర్ ని తీసుకు రాబోతున్న వాట్సాప్..!

ఈ కాలంలో ప్రతి ఒకరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం మనం చూసే ఉంటాము.అలాగే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్స్ లో మనకు కనిపించే యాప్ ఏదన్నా ఉంది అంటే అది వాట్సాప్ అని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.

 Whatsapp New Custom Image Sticker Coming Soon, Whatsapp New Feature,  Whatsapp,-TeluguStop.com

అంతలా వాట్సాప్ ప్రజాదరణ పొందింది.దానికి తగ్గట్టుగానే వాట్సాప్ కూడా అనేక కొత్త కొత్త ఫీచర్లతో మనకు అందుబాటులోకి వస్తుంది.

ఈ క్రమంలోనే వాట్సాప్ మరొక సరికొత్త ఫీచర్ ను మన ముందుకు తీసుకురాబోతుంది.మరి ఆ ఫీచర్ ఏంటి.? అది ఎలా వినియోగదారులుకు ఉపయోగపడుతుందో అనే వివరాలు ఒకసారి తెలుసుకుందామా.

సరికొత్త ఫీచర్ యూజర్ల ఫోటోలను స్టిక్కర్‌ లుగా మార్చేందుకు అనుమతించే ఫీచర్ అన్నమాట.

ఈ ఫీచర్ ఇప్పటికే బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది.ఇప్పుడు వాట్సాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారుల నిమిత్తం ఈ ఫీచర్‌ ను అభివృద్ధి చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

ఒక ప్రముఖ వార్త కధనం ప్రకారం యూజర్ యొక్క ఫోటోలు స్టిక్కర్‌ లుగా మార్చుకోవడమే ఈ ఫీచర్ యొక్క ఉద్దేశం.ఈ ఫీచర్ మనకి అందుబాటులోకి రాగానే, క్యాప్షన్ బార్ పక్కన కొత్త స్టిక్కర్ ఐకాన్ కనిపిస్తుంది.

అప్పుడు దానిని మనం సెలెక్ట్ చేసినప్పుడు యూజర్ యొక్క ఫోటో స్టిక్కర్‌గా పంపబడుతుంది.ఇలా యూజర్ ఇమేజ్‌ను స్టిక్కర్‌గా మార్చే ప్రత్యేక సెలెక్షన్ ఆప్షన్ డైలాగ్ బాక్స్‌లో మనకు కనిపిస్తుంది.

Telugu Latest, Whats, Whatsapp, Whatsapp Beta, Whatsappcustom, Whatsapp Ups-Late

మీరు మీ ఫోటోని పంపాలనుకున్నప్పుడు స్టిక్కర్ సెలక్షన్‌ పై నొక్కిన వెంటనే మీ చిత్రం దానంతట అదే స్టిక్కర్‌గా మారుతుంది.రానున్నా రోజుల్లో ఈ వాట్సాప్ అప్ కమింగ్ ఫీచర్ అన్ని మొబైల్ ఫోన్స్ లో అందుబాటులోకి రానుందని ఆ సంస్థ చెబుతుంది.వాట్సాప్ ఇప్పుడు ఈ ఫీచర్‌పై పనిచేస్తోంది.అలాగే ఈ ఫీచర్ తో పాటు బీటా యేతర వినియోగదారులకు మల్టీ-డివైజ్ ఫీచర్‌ని కూడా యాక్సెస్ చేసుకునేలాగా కూడా వాట్సాప్ చూస్తుంది.

ఇలా మల్టీ-డివైజ్ ఫీచర్ ను వాడే యూజర్లు తమ ఫోన్‌ తో పాటు మరో నాలుగు ఇతర డివైజ్‌లలో కూడా వాట్సాప్ మెసేజింగ్ యాప్‌ ను వినియోగించుకోవచ్చు అన్నమాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube