అమెరికాలో తెలుగు మహిళల కోసం ప్రత్యేక సంఘం..!!  

  • అమెరికాలో తెలుగు రాష్ట్రాల ఎన్నారైలకి కొదవే లేదు. భారత్ నుంచీ అమెరికా వెళ్ళిన ఎన్నారైలలో అత్యధికంగా తెలుగు వారు ఉండటం గమనార్హం. అక్కడ తెలుగు సంఘాలు కూడా ఎక్కువే అయితే. తెలుగు వారికి సాయం చేయడానికి వారికి అన్ని విధాలుగా సహకారం అందించడానికి ఎప్పుడూ ముందుంటాయి తెలుగు సంఘాలు.అయితే తాజాగా అమెరికాలో కేవలం మహిళల కోసం ఓ తెలుగు సంఘం ఏర్పాటు అయ్యింది. ఈ సంఘాన్ని ఏర్పాటు చేసింది కూడా TATA మాజీ అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి. ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్‌ పేరుతో ఆమె ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు.

  • ఈ సంఘాన్ని ఉమెన్స్‌ డే రోజున ప్రకటించారు. ఇది తెలుగు మహిళలకి ఎంతో గర్వకారంగా ఉండేలా తీర్చి దిద్దుతామని ఆమె ప్రకటించారు. స్త్రీ ప్రగతే ఈ అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు. అందుకు తగ్గట్టుగానే ఆమె లోగోని డిజైన్ చేయించారు. ఇదిలాఉంటే ఈ సంఘానికి అడ్వయిజరీ కౌన్సిల్‌ చైర్‌, ప్రెసిడెంట్‌ కూడా అయిన ఝాన్సీరెడ్డి ఈ సంఘం ద్వారా మహిళ నాయకత్వ శక్తిని ప్రపంచానికి చాటుతామన్నారు.

  • WETA Women Empowerment Telugu Association-

    WETA Women Empowerment Telugu Association

  • అయితే ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణాలని ఆమె తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఇప్పుడు ఉంటున్న తెలుగు సంఘాలలో మహిళలకి తగు న్యాయం జరగడం లేదని, అందుకే తమకి తాముగా ఓ సంఘం ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు.