అమెరికాలో మహిళల కోసం ప్రత్యెక తెలుగు సంఘం

అమెరికా వ్యాప్తంగా తెలుగు వారి కోసం వివిధ తెలుగు సంఘాలు ఎన్నో ఉన్నాయి.ప్రాంతాల వారిగా, రాష్ట్రాల వారిగా ఉన్న తెలుగు సంఘాలని లెక్కపెట్టుకుంటే కోకొల్లలుగా ఉన్నాయి.

 Weta Women Empowerment Telugu Association Formed In Usa1-TeluguStop.com

తెలంగాణా కి చెందిన వారు ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాళ్ళు మరొక సంఘాన్ని చేసుకున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు కలిసి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న సంఘాలు కూడా ఉన్నాయ్.

ఈ క్రమంలో మహిళల కోసం కూడా ఓ సంఘం ఉండాలని భావించిన ఓ మహిళా ఎన్నారై అమెరికాలో ప్రత్యేకంగా తెలుగు మహిళల కోసం ఓ సంఘాన్ని ఏర్పాటు చేసింది.

గతంలో వివిధ తెలుగు సంఘాలలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ ఎన్నారై ఝాన్సీ రెడ్డి, ఆమె ఆధ్వర్యంలో ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ ని ఏర్పాటు చేశారు.

ఈ సంఘం ముఖ్య ప్రారంభ కార్యక్రమాన్ని సెప్టెంబరు 29న సిలికాన్ వ్యాలీలో ప్రారంభించనున్నారు.ప్రముఖ సినీ నటి, తెలుగు మహిళ , పార్లమెంట్ సభ్యురాలు అయిన సుమలత కి ఈ సభలో జీవిత సాఫల్య పురస్కారం అందచేస్తామని ఝాన్సీ రెడ్డి తెలిపారు.

అమెరికాలో మహిళల కోసం ప్రత్యె

అమెరికా వ్యాప్తంగా ఉంటున్న తెలుగు మహిళలని ఒకే తాటిపైకి తీసుకురావడం, తెలుగు బాష, సాంప్రదాయాలని, కళలని పరి రక్షించడం ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంస్థ సేవలు కొనసాగుతాయని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube