విండీస్ మాజీ క్రికెటర్ కు అస్వస్థత  

West Indies Ex Cricketer Admits In Mumbai Global Hospital-

వెస్టిండిస్‌ జట్టు మాజీ క్రికెటర్‌ బ్రియాన్‌ లారా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ముంబై లోని ఒక హోటల్ లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరైన బ్రియాన్ లారా మధ్యలోనే అస్వస్థతకు గురయ్యారు.

West Indies Ex Cricketer Admits In Mumbai Global Hospital--West Indies Ex Cricketer Admits In Mumbai Global Hospital-

ఛాతి నొప్పి రావడం తో ఆయన అస్వస్థతకు గురయ్యారని ఈ క్రమంలో ముంబై లోని గ్లోబల్ ఆసుపత్రి లో జాయిన్ చేసినట్లు సమాచారం.లారా గత కొన్ని రోజులుగా ముంబయిలోనే ఉంటూ, స్టార్‌ స్పోర్ట్స్‌ స్టూడియోలో కామెంటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.

West Indies Ex Cricketer Admits In Mumbai Global Hospital--West Indies Ex Cricketer Admits In Mumbai Global Hospital-

మొన్నటివరకూ ఐపీఎల్‌ కోసం పనిచేసిన లారా ప్రస్తుతం ప్రపంచకప్‌ కోసం కామెంటరీ సేవలు అందిస్తున్నారు.అయితే ఈ క్రమంలో ఒక హోటల్ లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరైన లారా ఉన్నట్టుండి చాతి నొప్పి రావడం తో హుటాహుటిన గ్లోబల్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మరోపక్క లారా అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలియగానే స్టార్ స్పోర్ట్స్‌ అధికారులు గ్లోబల్‌ ఆస్పత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం లారా ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన సన్నిహితులు తెలిపారు.ఆయన ఆరోగ్యంపై గ్లోబల్‌ ఆస్పత్రి వర్గాలు బులెటిన్‌ విడుదల చేసే అవకాశముంది.భారత్‌-అఫ్గాన్‌ మ్యాచ్‌ అనంతరం కామెంటరీ బాధ్యతల నుంచి కాస్త విరామం తీసుకున్న లారా 27న జరిగే విండీస్‌-భారత్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని సమాచారం.