షాపులో దొంగతనం... క్యాష్ బాక్స్ టచ్ చేయకుండా ఏం చేశారంటే?

దొంగతనం చేసే వారు బేసిక్ గా డబ్బులు లేదంటే నగలు దొంగతనం చేస్తారు.ఇంకా లేదనుకుంటే కాస్ట్లీ వస్తువులు ఎత్తుకుపోతారు.

 West Bengal Onion Theft-TeluguStop.com

ఇప్పటి వరకు జరిగే దొంగతనాలు అన్ని అలాగే జరిగాయి.కాని తాజాగా పశ్చిమ బెంగాల్ లో దొంగలు ఓ కూరగాయల షాపులో దొంగతనంకి వెళ్లి కేవలం ఉల్లిపాయలు దొంగతనం చేసారంటే నమ్మగలరా కాని ఇదే నిజం.

అక్షయ్ దాస్ అనే వ్యక్తి తూర్పు మిడ్నాపూర్ జిల్లా సుతహతా ప్రాంతంలో ఓ కూరగాయల షాపు నిర్వహిస్తున్నాడు.షాపు తెరవగానే అక్కడ ఉన్న పరిస్థితి చూసి నోరెళ్లబెట్టాడు.షాపులో దాదాపు రూ.50 వేల విలువైన ఉల్లిపాయలు మాయమ్యాయి.

వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి.షాపులో దొంగలు పడ్డారని నిర్ధరించుకున్న అతను కంగారుగా క్యాష్ బాక్స్ వద్దకు వెళ్లి దాన్ని తెరిచి చూసాడు.అది చూసిన అతను ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు.క్యాష్ బాక్స్ లో పెట్టిన డబ్బులు పెట్టినట్లు ఉన్నాయి.

అందులో ఒక్క రూపాయి కూడా పోలేదు.ఇక ఇతర వస్తువులు కూడా షాపులో దొంగలు తీసుకెళ్ళలేదు.

కేవలం వారు ఉల్లిపాయలు మాత్రమే దొంగతనం చేసారు.ప్రస్తుతం బెంగాల్ లో కిలో ఉల్లిపాయల ధర 100 రూపాయలకు ఉండటంతో ఆ దొంగ వెరైటీగా సొమ్ము కంటే ఉల్లి బెటర్ అని దానిని ఎత్తుకుపోయాడు.

షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసారు.అయితే ఉల్లిపాయలు దొంగతనం జరిగిన విషయం ఆ చుట్టూ పక్కల తెలియడంతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవడంతో ఇప్పుడు ఆ దొంగతనం చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube