పీకే కు జడ్ కేటగిరీ భద్రత కల్పించనున్న దీదీ

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త,ఐ ప్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిషోర్ కు ఇటీవల డిమాండ్ ఎక్కువైపోయిన సంగతి తెలిసిందే.2019 ఏపీ లో వైసీపీ అధికారంలోకి రావడానికి,అలానే 2020 లో రీసెంట్ గా ఢిల్లీ లో మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడానికి వ్యూహాలు రచించి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు.అయితే పీకే కు పశ్చిమ బెంగాల్ సర్కార్ జడ్ కేటగిరి భద్రత కల్పించబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తృణమూల్ కాంగ్రెస్ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం.2019 లోక్‌సభ ఎన్నికలలో టీఎంసీ ఘోరంగా విఫలమైన తర్వాత, పీకేను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుంది.అందుకు తగ్గట్టుగానే బెంగాల్‌లో గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో టిఎంసి మొత్తం మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది.

 West Bengal Giving Z Category Security For Prashant Kishor-TeluguStop.com

అయితే పశ్చిమ బెంగాల్‌లో ప్రజా జీవితంతో ఎటువంటి సంబంధం లేని ప్రశాంత్ కిషోర్ కు ఇలా జడ్ కేటగిరి కల్పించడం పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Telugu Aapprashanth, Apycp, Prashant Kishor, Bengalcategory-Political

అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తో ఎలాంటి సంబంధం లేని పీకే కు రాష్ట్ర ప్రభుత్వ వ్యయం తో ‘జడ్’ కేటగిరీ భద్రత ఎందుకు కల్పిస్తున్నారని సిపిఐ (ఎం) శాసనసభ పార్టీ నాయకుడు సుజన్ చక్రవర్తి ప్రశ్నించారు.ఇక జెడి (యు) గత నెలలో.ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తోన్న కిశోర్‌ను పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండటం లేదన్న కారణంతో బహిష్కరించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు దీదీ సర్కార్ భద్రత కల్పించడం తో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube