నందిగ్రామ్‌ ఎన్నికల ఫలితాల విషయంలో కోర్టుకు వెళతానంటున్న మమత...

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దీదీ వర్సెస్ మోదీ మధ్య పోరు హోరాహోరీగా సాగిన విషయం తెలిసిందే.ఇక దేశంలో కోవిడ్ ఉద్ధృతంగా ఉన్నా ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను, ఎన్నికల కమిషన్ నిర్వహించడంతో విమర్శలు కూడా ఎదుర్కొంది.

 West Bengal Cm Mamata Banarjee To Go Court Over Nandigram Result, West Bengal, C-TeluguStop.com

కాగా మొత్తానికి ఈ పోరు ముగిసింది.

అయితే నందిగ్రామ్‌లో మమతా గెలుపొందినట్టు మొదట ప్రకటించినా.

రీకౌంటింగ్ చేపట్టడంతో సువేందు 1,662 ఓట్లతో మమత పై విజయం సాధించినట్టు ఈసీ ప్రకటించింది.అయితే, మరోసారి తృణమూల్‌ రీకౌంటింగ్‌ కోరగా ఎన్నికల సంఘం తిరస్కరించినట్టు ప్రచారం.

ఇదిలా ఉండగా రీకౌంటింగ్ కు అంగీకరిస్తే తమ ప్రాణాలకే ముప్పు ఉంటుందని ఓ రిటర్నింగ్ అధికారిని బెదిరించిన విషయం తనకు తెలిసిందని మమత చెప్పడం సంచలనంగా మారింది.ఇక బీజేపీకి ఈసీ తొత్తుగా పనిచేసిందని, అందుకే ఫలితాలు తారుమారు అయ్యాయని దుయ్యబట్టారు.

అదీగాక ఈ ఫలితాల పై తనకు అనుమానాలు ఉన్నాయని అందువల్ల కోర్టుకు వెళతానని దీదీ చెప్పడంతో ఇప్పుడు నందిగ్రామ్‌లో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కొంత కష్టంగా మారిందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube