నందిగ్రామ్‌ ఎన్నికల ఫలితాల విషయంలో కోర్టుకు వెళతానంటున్న మమత...

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దీదీ వర్సెస్ మోదీ మధ్య పోరు హోరాహోరీగా సాగిన విషయం తెలిసిందే.ఇక దేశంలో కోవిడ్ ఉద్ధృతంగా ఉన్నా ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను, ఎన్నికల కమిషన్ నిర్వహించడంతో విమర్శలు కూడా ఎదుర్కొంది.

 West Bengal Cm Mamata Banarjee Decide Go To Court On Nandigram-TeluguStop.com

కాగా మొత్తానికి ఈ పోరు ముగిసింది.

అయితే నందిగ్రామ్‌లో మమతా గెలుపొందినట్టు మొదట ప్రకటించినా.

 West Bengal Cm Mamata Banarjee Decide Go To Court On Nandigram-నందిగ్రామ్‌ ఎన్నికల ఫలితాల విషయంలో కోర్టుకు వెళతానంటున్న మమత…-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రీకౌంటింగ్ చేపట్టడంతో సువేందు 1,662 ఓట్లతో మమత పై విజయం సాధించినట్టు ఈసీ ప్రకటించింది.అయితే, మరోసారి తృణమూల్‌ రీకౌంటింగ్‌ కోరగా ఎన్నికల సంఘం తిరస్కరించినట్టు ప్రచారం.

ఇదిలా ఉండగా రీకౌంటింగ్ కు అంగీకరిస్తే తమ ప్రాణాలకే ముప్పు ఉంటుందని ఓ రిటర్నింగ్ అధికారిని బెదిరించిన విషయం తనకు తెలిసిందని మమత చెప్పడం సంచలనంగా మారింది.ఇక బీజేపీకి ఈసీ తొత్తుగా పనిచేసిందని, అందుకే ఫలితాలు తారుమారు అయ్యాయని దుయ్యబట్టారు.

అదీగాక ఈ ఫలితాల పై తనకు అనుమానాలు ఉన్నాయని అందువల్ల కోర్టుకు వెళతానని దీదీ చెప్పడంతో ఇప్పుడు నందిగ్రామ్‌లో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కొంత కష్టంగా మారిందట.

#WestBengal #West Bengal #Court #Decide

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు