పశ్చిమ బెంగాల్ లో కరోనా మృతుల కుటుంబంలో ఒక‌రికి ప్ర‌భుత్వ ఉద్యోగం, పది లక్షలు.... కానీ.....?

దేశంలో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాలుస్తోంది.రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

 West Bengal Cm Good News To Corona Warrior Families, West Bengal, Mamata Benarje-TeluguStop.com

లాక్ డౌన్ సడలింపులకు ముందు 6,000కు అటూఇటుగా నమోదైన కేసులు ప్రస్తుతం 30,000కు అటూఇటుగా నమోదవుతున్నాయి.కరోనా మహమ్మారి కట్టడి కోసం శ్రమిస్తున్న వారియర్స్ సైతం వైరస్ బారిన పడుతున్నారు.

తాజాగా కరోనా సోకి మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సీఎం మమతాబెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

పశ్చిమ బెంగాల్ లో ఇప్పటివరకు 12 మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనాకు బలి కాగా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం ప్రకటన చేశారు.

వైద్యులు, పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు వైరన్ నియంత్రణలో భాగంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు.దీంతో వాళ్లు కరోనా బారిన పడి మరణిస్తే వాళ్ల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని అన్నారు.

ప్రభుత్వ రంగంలో పని చేసే ఉద్యోగులతో పాటు ప్రైవేట్ రంగంలో కరోనా నియంత్రణ కొరకు కృషి చేస్తున్న వాళ్లకు సైతం ఇదే విధంగా ఆర్థిక సహాయం అందజేస్తామని కీలక ప్రకటన చేశారు.రాష్ట్రంలో రోజురోజుకు కరోనా భారీన పడుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోందని ప్రజలు వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తే మాత్రమే వైరస్ బారిన పడకుండా ఉంటామని అన్నారు.

పశ్చిమ బెంగాల్ లో ఇప్పటివరకు 34,427 కరోనా కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 1,589 కరోనా కేసులు నమోదు కాగా 20 మంది మృతి చెందారు.ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube