ప్రజలను ఇబ్బంది పెడుతున్న రాజకీయ పోరు.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి షాకిచ్చిన సుప్రీంకోర్టు.. !

రాజకీయ నాయకుల పంతాల వల్ల ఒక్కోసారి ప్రజలకు ఇబ్బందులు కలిగిన సందర్భాలున్నాయి.తాజాగా ఇలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది.

 West Bengal Chief Minister Shocked By Supreme Court-TeluguStop.com

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, కేంద్రానికి పాము ముంగిసల కొట్లాటల ఉంటుంది.అసలు బీజేపీ అంటే మమతకు మంటగా ఉంటుందని ప్రచారం.

ఇలాంటి సమయంలో దేశవ్యాప్తంగా వలస కార్మికులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్ర‌భుత్వం వ‌న్ నేష‌న్ – వ‌న్ రేష‌న్ పథకం తీసుకొచ్చింది.అయితే ఈ పధకాన్ని మాత్రం పశ్చిమ బెంగాల్ లో అమలు చేయడం లేదట.

 West Bengal Chief Minister Shocked By Supreme Court-ప్రజలను ఇబ్బంది పెడుతున్న రాజకీయ పోరు.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి షాకిచ్చిన సుప్రీంకోర్టు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు మమతకు షాకిచ్చింది.మీ రాజకీయ పోరులో అనవసరంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని, ఈ ప‌థ‌కం అమ‌లు విషయంలో ఎలాంటి సాకులు చూపకుండా, వెంటనే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.

ఇకపోతే బీజేపీ, టీఎంసీ మ‌ధ్య పచ్చగడ్ది వేస్తే భగ్గుమనేలా ఉన్న నేపధ్యంలో కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒప్పుకోవ‌డం లేదు.ఈ క్రమంలో సుప్రీం కోర్టు జోక్యం తప్పని సరి అయ్యిందట.

అయినా రాజకీయ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చేయాలి కానీ ఇలా ప్రజలకు అందవలసిన పధకాల విషయంలో ప్రతిష్టలకు పోవడం సరికాదని ఈ నాయకులకు తెలిసేది ఎప్పుడో.!!

.

#OneNation #Supreme Court #West Bengal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు