జోష్ లో ఉన్న పశ్చిమ బెంగాల్ బీజేపీ క్యాడర్..!!

త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలలో ఊహించని విధంగా ఎంపీ స్థానాలు గెలవడంతో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో అదే రీతిలో రాణించాలని బిజెపి క్యాడర్ సరికొత్త వ్యూహాలతో అడుగులు వేస్తూ ఉంది.

 West Bengal Bjp Cadre In Josh-TeluguStop.com

దీనిలో భాగంగా ఇప్పటికే కేంద్రంలో కీలక మంత్రులు పశ్చిమబెంగాల్లో పర్యటించడం జరిగింది.

కాగా జరుగుతున్న సర్వేలలో కూడా బిజెపి గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఫలితాలు వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఇప్పటికే కొంతమంది కాషాయ కండువ కప్పుకోవడం జరిగింది.

 West Bengal Bjp Cadre In Josh-జోష్ లో ఉన్న పశ్చిమ బెంగాల్ బీజేపీ క్యాడర్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా బెంగాల్ రాష్ట్రంలో సెలబ్రిటీ మరియు ఎంతో క్రేజ్ ఉన్న స్టార్ నటి స్రబంతి ఛటర్జీ తాజాగా బీజేపీలో చేరారు.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్‌ విజయ్‌ వర్గియా, బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ సమక్షంలో స్రబంతి పార్టీలో చేరారు.

దీంతో ఆమె రాకతో ప్రస్తుతం బిజెపి కేడర్లో ఫుల్ జోష్ నెలకొంది.సినీ గ్లామర్ కూడా తోడు కావడంతో బిజెపి కేడర్ ప్రచారంలో దూసుకుపోతుంది.

.

#WestBengal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు