ఏం జరుగుతుందో అమెరికన్లు తెలుసుకోవాలి.. అందుకే వచ్చా: బైడెన్

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించకముందే తన తొలి పోరాటం కోవిడ్ మీదేనని ప్రకటించారు జో బైడెన్.ఇక వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆయన తొలి సంతకం చేశారు.వీటిలో సింహభాగం కోవిడ్‌కు సంబంధించినవే.కరోనాపై యుద్ధం ప్రకటించిన ఆయన నిర్థారణా పరీక్షలు, వ్యాక్సినేషన్, వైద్య రంగానికి కావాల్సిన ఇతర మౌలిక వసతులను అందించేందుకు భారీ ప్యాకేజీ‌ని ప్రకటించారు.అలాగే ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు గాను 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజ్‌ను తీసుకొచ్చారు.

 Were Going To Beat Covid: Biden After Visiting Pfizer Vaccine Manufacturing Plan-TeluguStop.com

‘ద అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌’ పేరుతో ప్రకటించిన ఈ భారీ ప్యాకేజీ ద్వారా కరోనా మహమ్మారితో అల్లాడుతున్న ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తామని ఆయన చెప్పారు.ఈ నిధులతో కరోనా పరీక్షల నిర్వహణ, టీకా కార్యక్రమాలతో పాటు.

పౌరులకు నేరుగా ఆర్థిక సాయం, చిరు వ్యాపారులకు అండగా నిలవడం వంటి కార్యక్రమాలు చేపడతామని బైడెన్ తెలిపారు.ఇక ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల వున్న లేనిపోని అపోహాలు పోగొట్టేందుకు గాను ఆయన పబ్లిక్‌గా టీకా తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో గత శుక్రవారం మిచిగాన్‌లోని కలాంజూలో వున్న ఫైజర్ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని అధ్యక్షుడు సందర్శించారు.

Telugu America, Covid, Joe Biden, Pfizer Vaccine, American Rescue, Vaccine-Telug

ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో మాట్లాడిన బైడెన్‌, ఫైజర్‌ టీకా తయారీ విధానం గురించి తెలుసుకున్నారు.ఉద్యోగుల నిరంతర శ్రమ ఫలితంగానే అమెరికన్లు కొవిడ్‌-19 పై విజయం సాధించనున్నారని అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు.ఇందుకుగాను ఆయన ఫైజర్ కర్మాగార సిబ్బందికి కృతజ్ఞతలు తెలియచేశారు.

అమెరికా ఇప్పటి వరకు ఎదుర్కొన్న సవాళ్లన్నిటికంటే కరోనా క్లిష్టమైనదని.దానిని జయించేందుకు జరుగుతున్న కృషిని, ప్రయత్నాన్ని గురించి అమెరికన్లు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఇక్కడకు వచ్చినట్టు బైడెన్‌ ప్రకటించారు.

Telugu America, Covid, Joe Biden, Pfizer Vaccine, American Rescue, Vaccine-Telug

ఫైజర్ టీకా చాలా సురక్షితమని.ప్రజలు తప్పకుండా తీసుకోవాలని అధ్యక్షుడు సూచించారు.వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల నిర్లక్ష్యం వహించవద్దని ఆయన హితవు పలికారు.వ్యాక్సినేషన్ కార్యక్రమం భారీగా జరుగుతున్నందున ఈ ఏడాది చివరి నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube